HOME »NEWS »POLITICS »new problems facing ys sharmila before announcing her party bk

YS Sharmila: పార్టీ పెట్ట‌డానికి ముందే ష‌ర్మిళ‌కు కొత్త త‌ల‌నొప్పులు?

YS Sharmila: పార్టీ పెట్ట‌డానికి ముందే ష‌ర్మిళ‌కు కొత్త త‌ల‌నొప్పులు?
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్న జ‌గ‌న్ పార్టీ త‌రుపుణ ప్ర‌చారం చేసిన ష‌ర్మిళ ప్ర‌త్యేక హోదా లాంటి అంశాల‌పై స్ప‌ష్ట‌మైన హామీలు ఇచ్చారు. అయితే ఎన్నిక ఫ‌లితాల త‌రువాత నుంచి ఏపీ రాజ‌కీయ స్కీన్ పై ఆమె ఎక్కడా క‌నిపించ‌లేదు. ఇప్పుడు స‌డెన్ గా తెలంగాణ‌లో పార్టీ పెట్టాడానికి రెడీ అవుతున్న ష‌ర్మిళ‌పై ప్ర‌త్యేర్ధి పార్టీలో ఏపీలో ఇచ్చి హామీల సంగ‌తేంట‌ని ప్ర‌శ్న‌లు సంధిస్తోన్నారు.

 • Share this:
  తెలంగాణ‌లో ష‌ర్మిళ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఆమెకు కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డ్డాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న ష‌ర్మిళ ఇప్పుడు ఉహించని ఈ ప‌రిణామాల‌తో కాస్త ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జ‌రిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల అన్న జ‌గ‌న్ పార్టీ త‌రుపుణ‌ విస్తృతంగా ప్రచారం చేశారు.' బై బై బాబు' అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు ఒక విధంగా స‌క్సెస్ అయ్యారు కూడా. ష‌ర్మిళ ప్రచారం ఏపీలో జ‌గ‌న్ పార్టీ కి కాస్త క‌లిసోచ్చింద‌నే చెప్పుకోవాలి. అయితే అన్ని అనుకూలించి ఆ ఎన్నిక‌ల్లో ఉహించ‌ని విజ‌యం ద‌క్కించుకున్న‌ తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం రోజు కన్పించిన షర్మిల ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోయింది.

  అయితే ఎవ‌రు ఉహించ‌ని విధంగా సడన్ గా ఆమె తెలంగాణ లో రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్నాను అని ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ స‌ర్కిల్ ఉలిక్కిప‌డింది.  అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ కీల‌క నేత‌ల్లోనూ ఎక్కువైపోయింది. దీంతో ఎవ‌రికి తోచిన లెక్క‌లు వారు వేసుకోని ప్రెస్ మీట్ లు పెట్టి మ‌రి తెట్టాల్సి వారు తిట్టారు, పొగ‌డాల్సిన వారు పొగిడారు. అయితే ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్న ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయి అంటున్నారు ష‌ర్మిళ స‌న్నిహితులు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ లో జ‌గ‌న్ అన్న పార్టీ త‌రుపుణ ప్ర‌చారం చేసిన‌ప్పుడు ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా లాంటి ప‌లు కీల‌క అంశాపై హామీలు ఇచ్చిన ష‌ర్మిళ అక్క‌డ ఫ‌లితాలు త‌రువాత వాటి గురించి పెద్ద ప‌ట్టించుకోలేదు.  ఆ మాట‌కొస్తే రాజ‌కీయాల‌కే కొన్ని రోజులు దూర‌మైపోయారు. దీంతో ఇప్పుడు ష‌ర్మిళ తెలంగాణ లో పార్టీ పెడితే ప్ర‌త్య‌ర్ది పార్టీలు ఇవే అంశాల‌ను ఆమెపైకి సంధించే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు ష‌ర్మిళ వ‌ర్గంలో కొంత మంది స‌న్నిహితులు. అక్క‌డ ఓట్లు అడిగి గెలిచాక మొఖం చాటేసిన ష‌ర్మిళ ఇక్క‌డ తెలంగాణ‌లో ఏం చేయ‌గ‌లుగుతారు అనే వాధ‌న్ని పైకి తీసుకొస్తే త‌మ‌కి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తోన్నారు. ఇదిలా ఉంటే ష‌ర్మిళ మాత్రం పార్టీ ఏర్పాటుకు అన్ని ప‌నులు చ‌క‌చ‌క చేసేస్తోన్నారు. మ‌రో రెండు మూడు నెల‌ల్లో పార్టీ పేరుతోపాటు పార్టీ ఎజెండాకు సంబంధించి పూర్తి స్థాయి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉందని అంటున్నారు ష‌ర్మిళ స‌న్నిహితులు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే తెలంగాణ‌లో అన్న జ‌గ‌న్ పార్టీకి కేడ‌ర్ ఉంది... 2014 ఎన్నిక‌ల్లో ఒక‌టి అర సీట్లు కూడా ఆ పార్టీ కైవ‌సం చేసుకుంది. దీంతో తెలంగాణ‌కి ప్ర‌త్యేకంగా ఒక అధ్య‌క్షుడిని నియ‌మించారు జ‌గ‌న్. అయితే ఇక్క‌డ టీఆర్ఎస్ పార్టీతో ఉన్న స‌న్నిహిత సంబంధాలు వ‌ల‌న ఏ రోజు ప్ర‌భుత్వ విధానాల‌పై ఆ పార్టీ పోరాటాలు చేసే ప‌రిస్థితిలు రాలేదు. అందుకే అస‌లు తెలంగాణ‌లో వైసీపీ వింగ్ ఉందో లేదో ఎవ‌రికి తెలియ‌దు. అయితే ఇప్పుడు ష‌ర్మిళ పార్టీ పెడితే తాము ఆ పార్టీకి స‌పోర్ట్ చేయాలా లేక ప‌క్క‌నుండాలి అనే అంశంపై  ఇప్ప‌టికి అధినేత జ‌గ‌న్ నుంచి స్ప‌ష్ట‌త రాలేదు. దీంతో ఈ పార్టీ కేడ‌ర్ లో కూడా గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.
  Published by:Balakrishna Medabayani
  First published:February 23, 2021, 17:02 IST