• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NEW PM WILL BE THERE TO COUNTRY AFTER LOK SABHA ELECTIONS CHANDRABABU NAIDU SAYS NARENDRA MODI MAY NOT BECOME PRIME MINISTER AGAIN AK

రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడెందుకు ?... మోదీ పనైపోయిందన్న చంద్రబాబు

రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడెందుకు ?... మోదీ పనైపోయిందన్న చంద్రబాబు

చంద్రబాబు, నరేంద్రమోదీ

26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ ‌గాంధీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ... గత ఐదేళ్లలో తానేం చేశానో చెప్పాలని అన్నారు. దేశానికి చేసిందేమీ లేదు కాబట్టే మోదీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

  • Share this:

    లోక్ సభ ఎన్నికల తరువాత దేశానికి రాబోయేది కొత్త ప్రధాని అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదని అన్నారు. శ్రీ కాకుళం పార్లమెంటరీ సమీక్షలో ప్రసంగించిన చంద్రబాబు... దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామని అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామని వ్యాఖ్యానించారు.మోదీ వ్యతిరేక గాలిని దేశవ్యాప్తంగా ఉధృతం చేశామని చంద్రబాబు అన్నారు. ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని...ఫ్రస్టేషన్‌లో దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.

    26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ ‌గాంధీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ... గత ఐదేళ్లలో తానేం చేశానో చెప్పాలని అన్నారు. దేశానికి చేసిందేమీ లేదు కాబట్టే మోదీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. భారత రాజకీయాల్లో మోదీ కారణంగా హుందాతనం కొరవడిందని అన్నారు. మోదీ చెప్పిన గుజరాత్ నమూనా విఫల నమూనాగా మిగిలిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీపై తిరగబడ్డామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వీవీ ప్యాట్ రశీదుల కౌంటింగ్ 50% చేయాలని అడిగామన్న చంద్రబాబు... తమ పోరాటం వల్లే ఒక బూత్ కౌంటింగ్‌ను ఐదు బూత్‌లకు పెరిగిందని అన్నారు.





    First published: