ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల కోసం కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మచిలీపట్నం, పల్నాడు, అరకు జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా... కొత్త మెడకిల్ కాలేజీలకు లైన్ క్లియర్ అవుతుందనే భావనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం... ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని నిర్ణయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం... ఈ విషయంలో అనుకోని తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో ఏర్పాటయ్యే మెడికల్ కాలేజీని గురజాలలో ఏర్పాటు చేయాలనే దానిపై జగన్ సర్కార్ సూత్రప్రాయం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే కొత్తగా ఏర్పాటయ్యే పల్నాడు జిల్లాకు ఏ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేస్తారనే దానిపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పల్నాడుకు గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొందరు, నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై సర్కార్ ఏ నిర్ణయం తీసుకోలేదని... కొత్త జిల్లా పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల అభిప్రాయాలను పరిధిలోకి తీసుకున్న తరువాతే దీనిపై సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పల్నాడు జిల్లా ఏర్పాటు కాబోతోందనే ఆనందంతో ఉన్న ఆ ప్రాంత వైసీపీ నేతలకు... ఇప్పుడు జిల్లా కేంద్రం ఎక్కడనే టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.