Home /News /politics /

జగన్‌కు కొత్త తలనొప్పి... మాట వినని వైసీపీ ఎంపీ ?

జగన్‌కు కొత్త తలనొప్పి... మాట వినని వైసీపీ ఎంపీ ?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీతో రఘురామకృష్ణంరాజు మాట్లాడటం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్వయంగా సీఎం జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు.

    తిరుగులేని మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్ జగన్‌ మాటకు సొంత పార్టీలో తిరుగులేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆయన పార్టీ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ మాత్రం ఆయనకు తలనొప్పిగా మారారనే ప్రచారం జరుగుతోంది. ఆయనే నరసారపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీతో రఘురామకృష్ణంరాజు మాట్లాడటం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్వయంగా సీఎం జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలోనే రఘురామకృష్ణంరాజుకు జగన్ క్లాస్ తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది.

    Ap news, ap politics, ysrcp, ap cm ys jagan mohan reddy, raghuramakrishnam raju, bjp, pm modi, ఏపీ న్యూస్, వైసీపీ, జగన్, రఘురామకృష్ణంరాజు, బీజేపీ, ప్రధాని మోదీ
    రఘురామకృష్ణం రాజు, (నర్సాపురం, వైసీపీ)


    అయితే ఇది జరిగిన కొద్దిరోజులకే పార్లమెంట్‌లోని బీజేపీ కార్యాలయానికి రఘురామకృష్ణంరాజు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం రఘురామకృష్ణంరాజు ఆకస్మికంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన అక్కడ ఎవరితో.. ఏ అంశంపై చర్చించారో తెలియదు కానీ... దాదాపు గంటకుపైగా ఆయన బీజేపీ కార్యాలయంలో గడిపినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఇలా బీజేపీ ఆఫీసు వైపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డికి చెప్పకుండా కేంద్ర పెద్దలెవరినీ కలవొద్దని జగన్ చెప్పిన తరువాత కూడా రఘురామకృష్ణంరాజు ఈ రకంగా వ్యవహరించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు