టీడీపీలో కొత్త చర్చకు తెరలేపిన మాజీమంత్రి

రాజధానిపై రాష్ట్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరిన గంటా... విశాఖను ఏపీకి ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరడంపై సరికొత్త చర్చ మొదలైంది.

news18-telugu
Updated: August 29, 2019, 4:01 PM IST
టీడీపీలో కొత్త చర్చకు తెరలేపిన మాజీమంత్రి
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీ మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజధానిపై రాష్ట్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరిన గంటా... విశాఖను ఏపీకి ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరడంపై సరికొత్త చర్చ మొదలైంది. రాజధానిపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడం వరకు ఓకే కానీ... గంటా విశాఖను ఏపీ ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేయడం ఏంటనే విషయం టీడీపీ వర్గాలకు అర్థంకావడం లేదు. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న గంటా... ఉన్నట్టుండి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ చూడా మొదలైంది.

అయితే తమ ప్రాంత ప్రయోజనాలకు తగ్గట్టుగా గంటా మాట్లాడారని కొందరు భావిస్తుంటే... టీడీపీలో లేని తలనొప్పులు క్రియేట్ చేయడానికే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పెట్టడానికా లేక సొంత పార్టీని ఇరుకున పెట్టడానికా ? అనే అంశం కూడా టీడీపీ శ్రేణులకు అర్థంకావడం లేదు. ఈ రకమైన డిమాండ్ తెరపైకి తీసుకురావడానికి ముందు గంటా చంద్రబాబును సంప్రదించారా లేదా అనే అంశంపై టీడీపీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే గంటా రాజధానిని అమరావతి నుంచి మార్చాలని కోరలేదని... కేవలం విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని సూచించారని టీడీపీలోని పలువురు అభిప్రాయపడుతున్నారు.


First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు