ఏపీలో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో రాజకీయం రంజుగా మారింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తాను ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నేతల మీద విమర్శలు చేస్తున్నారు. దీంతో..వంశీ మీద టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఎమ్మెల్యేగా మాత్రం ఆయన పైన అనర్హత వేటు వేయాలని ఇప్పటి వరకు కోరలేదు.
తాను పార్టీ వీడుతున్నట్లుగా చెప్పిన తరువాత..తనను సస్పెండ్ చేయటం ఏంటని వంశీ ప్రశ్నిస్తున్నారు. దీంతో..అధికారికంగా వంశీ ఇప్పటికీ టీడీపీ శాసన సభ్యుడే. కానీ, టీడీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా శాసన సభకు హాజరయ్యే అవకాశం మాత్రం వంశీకి ఉంది.మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ శీతకాల సమావేశాలు మొదలుకాన్నియి. దీంతో ఇప్పుడు వంశీ టీడీపీ బెంచ్ ల్లో కూర్చొనే అవకాశం లేదు. అందుకు వంశీ సైతం సిద్దంగా లేరు. దీంతో..ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో వంశీ తీరు ఎలా ఉండబోతుంది..ఆయన సీటు ఎక్కడ కేటాయిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
అటు వైసీపీలో కూడా ఆయన అధికారికంగా చేరలేదు. ఒకవేళ చేరినా కూడా పదవికి రాజీనామా చేసి రావాలని ఇప్పటికే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సైతం స్పష్టం చేశారు. దీంతో వంశీ ఇప్పుడు సభలో ఎక్కడ కూర్చుంటారన్న అంశం హట్ టాపిక్‌గా మారింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.