• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NEW CM FOR ASSAM HIMANTA BISWA SARMA ELECTED ELECTED UNANIMOUSLY BY THE BJP LEGISLATURE PARTY SK

Assam: అసోంకు కొత్త సీఎం.. సర్బానంద సోనోవాల్ ఔట్.. వారం తర్వాత హైడ్రామాకు తెర

Assam: అసోంకు కొత్త సీఎం.. సర్బానంద సోనోవాల్ ఔట్.. వారం తర్వాత హైడ్రామాకు తెర

హిమంత బిశ్వ శర్మ, సర్బానంద సోనోవాల్

126 అసెంబ్లీ సీట్లున్న అసోంలో..ఎన్డీయేకు 75 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ నేత‌‌ృత్వంలోని మహా కూటమికి 50 సీట్లకు పరిమితమయింది. మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు.

  • Share this:
    అసోం కొత్త సీఎంపై క్లారిటీ వచ్చింది. వారం రోజుల హైడ్రామకు తెరపడింది. అసోం ప్రస్తుతం సీఎం సర్బానంద సోనావాల్‌కు బీజేపీ హైకమాండ్ పక్కనబెట్టింది. ఆయన స్థానంలో హిమంత బిశ్వ శర్మకు అవకాశం ఇచ్చింది. ఆదివారం గౌహతిలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై హిమంత బిశ్వ శర్మను శానససభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన పేరును సర్బానంద సోనోవాల్ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష సమవేశానికి కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, అసోం బీజేపీ ఇంచార్జి బైజయంత్ పాండా హాజరయ్యారు.

    బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి ముందు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆయనకు గవర్నర్ సూచించారు. అనంతరం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభా పక్ష నేతగా హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. ఇవాళ సాయంత్రం ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యే మద్దతు తనకు ఉందని లేఖ సమర్పించనున్నారు. ఇక అసోం కొత్త సీఎంగా హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా నేపథ్యంలో అతి కొద్ది సమక్షంలోనే నిరాడంబరంగా జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.


    126 అసెంబ్లీ సీట్లున్న అసోంలో..ఎన్డీయేకు 75 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ నేత‌‌ృత్వంలోని మహా కూటమికి 50 సీట్లకు పరిమితమయింది. మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 60, అసోం గణపరిషత్ (AGP)కి 9, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)కి 6 సీట్లు వచ్చాయి. ఇక మహాకూటమిలో కాంగ్రెస్‌కు 20, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ 16, బోడో పీపుల్స్ ఫ్రంట్ 4, సీపీఎం ఒక చోట విజయం సాధించాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు