ఏపీలో రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు

తెల్ల కార్డు దారులకు గతంలో ఈ కార్డులను జారీ చేసే వారు. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కారు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ఆదాయ పరిమితులను పెంచి తెల్ల రేషన్ కార్డుల జారీ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: February 16, 2020, 2:58 PM IST
ఏపీలో రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు
Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ... పాతవి ఔట్...
  • Share this:
ఏపీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల స్ధానంలో కొత్త కార్డులు రాబోతున్నాయి. రేషన్ కార్డుల వ్యవస్ధలో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో వాటి ప్రయోజనాలను విస్తరించడంతో పాటు అనర్హుల ఏరివేత చేపట్టాలని జగన్ సర్కారు భావిస్తుండటమే అందుకు కారణం. ఇకపై రేషన్ కార్డుల స్ధానంలో బియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛన్లకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నవశకం పేరుతో జరిపిన సర్వేలో తేలిన వివరాల ఆధారంగా వీటి ప్రక్షాళన ప్రారంభం కాబోతోంది.

దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి కనీస అవసరాలు తీర్చేందుకు వీలుగా ప్రారంభించిన రేషన్ కార్డులు అర్హులకు ఏమాత్రం మేలు చేస్తున్నాయో తెలియదు కానీ అనర్హులకు మాత్రం వరంలా మారిపోయాయి. ప్రభుత్వాలు మారుతున్నా అనర్హులను పూర్తిస్ధాయిలో తొలగించి రేషన్ కార్డుల ప్రయోజనాలను అర్హులకు అందించడం సాధ్యం కాలేదు. రేషన్ డీలర్లు డిపోల్లో సాగిస్తున్న అరాచకాలు వీటికి అదనం. దీంతో రేషన్ కార్డుల వ్యవస్ధను ప్రక్షాళన చేస్తే కానీ అర్హులకు ప్రయోజనాలను అందించడం సాధ్యం కాదని భావిస్తున్న వైసీపీ సర్కారు కటిన చర్యలకు సిద్దమవుతోంది. ముందుగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి జాబితాను పూర్తిస్ధాయిలో సేకరించిన సర్కారు... వాటిలో తెల్ల కార్డులున్న వారిలో దాదాపు నాలుగో వంతు మంది వాటి కనీస ప్రయోజనమైన బియ్యాన్ని కూడా తీసుకోవడం లేదని గుర్తించింది. వీరిలో ఎంతమందికి బియ్యం అవసరం ఉందో ఎంతమందికి లేదన్న అంశాన్ని పక్కనబెడితే బియ్యం కోసం రేషన్ కార్డులు వాడని వారిపై ప్రధానంగా దృష్టిసారించినట్లు అర్ధమవుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధారంగా ఉన్న తెల్ల రేషన్ కార్డులను వివిధ మార్గాల్లో సంపాదించిన వారు నాణ్యత లేని బియ్యాన్ని తీసుకోవడం లేదనే విషయం తేటతెల్లమైంది.

ఏపీ ప్రజలకు షాక్... కరెంట్ బిల్లు ఎక్కువస్తే రేషన్, పెన్షన్ కట్, ap govt new rules on ration pension cards issue
ప్రతీకాత్మక చిత్రం


వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీగా, అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవగా, తిరిగి వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా పేరుమార్చుకున్న ఆరోగ్య పథకానికీ తెల్ల రేషన్ కార్డే ఆధారం. తెల్ల కార్డు దారులకు గతంలో ఈ కార్డులను జారీ చేసే వారు. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కారు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ఆదాయ పరిమితులను పెంచి తెల్ల రేషన్ కార్డుల జారీ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీంతో ఆరోగ్యశ్రీ పథకం అర్హతలు కూడా మారిపోయాయి. అంటే సవరించిన అర్హతలతో తెల్ల రేషన్ కార్డులతో సంబంధం లేకుండా్ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డుల జారీ తప్పనిసరిగా మారింది.ration door delivery by volunteers postponed in andhra pradesh, ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీ వాయిదా... కారణం అదేనా ?
ప్రతీకాత్మక చిత్రం


అలాగే రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు, వితంతువులు, వికలాంగులకు ఇస్తున్న ఆసరా పింఛన్ల మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం పెంచింది. అదే సమయంలో పింఛన్ల పథకం పేరు కూడా మారింది. దీంతో పెరిగిన మొత్తాలతో వైఎస్సార్ ఆసరా పింఛన్లను ఇస్తున్నారు. ఈ మొత్తాలను ఇప్పటికే 2250కు పెంచగా వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి మరో 250 రూపాయల చొప్పున పెరగబోతున్నాయి. ఇందుకోసం సవరించిన అర్హతలు, మొత్తాలతో ప్రత్యేక కార్డులను ప్రభుత్వం జారీ చేస్తోంది. అంటే వీటికీ తెల్ల రేషన్ కార్డులకూ సంబంధం లేదు. అలాగే అమ్మఒడి, విద్యాదీవెన పథకాలకూ ప్రత్యేక కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్ధూలంగా చూస్తే వీటన్నింటికీ గతంలో తెల్ల రేషన్ కార్డులే ప్రామాణికంగా ఉండేవి. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా జనం తెల్ల రేషన్ కార్డులను ఏదో విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉండేవారు.

తాజాగా సిద్దమైన ప్లాన్ ప్రకారం ఇకపై బీపీఎల్ అర్హతలతో ఉండి బియ్యం, ఇతర వంట సామాగ్రి కావాలనుకునే వారికి బియ్యం కార్డులు మాత్రమే జారీ చేస్తారు. అలాగే ఆరోగ్యశ్రీకి ఇచ్చిన అర్హతలు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రమే జారీ చేస్తారు. అలాగే పింఛన్లు కావాల్సిన వారికి ఆయా అర్హతల ఆధారంగా ప్రత్యేక కార్డులు ఉంటాయి. అమ్మఒడి, విద్యాదీవెన పథకాలకూ ప్రత్యేక కార్డులు రాబోతున్నాయి. ఆధార్ అనుసంధానంతో అర్హతలు పరిశీలించి రేషన్ కార్డుల స్ధానంలో ఆయా అవసరాల మేరకు ప్రత్యేక కార్డుల జారీ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో ఆరోగ్యశ్రీ, పింఛన్లు బియ్యం కార్డుల జారీ ఇప్పటికే ప్రారంభం కాగా.. మిగిలిన కార్డులు కూడా త్వరలో అందిస్తారు.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు