Punjab politics: పంజాబ్​లో 15 మందితో కొత్త మంత్రివర్గం.. కేబినేట్​లోకి ఆరుగురు కొత్తవారికి అవకాశం

పంజాబ్​ కొత్త మంత్రివర్గం (Photo: ANI /Twitter)

కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 15 మందితో కూడిన మంత్రివర్గం ఆదివారం సాయంత్రం రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్​ భన్వరిలాల్​ పురోహిత్​ (Bhanvarilal purohit) వీరందరితో ప్రమాణం చేయించారు.

 • Share this:
  పంజాబ్​ (Punjab)లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 15 మందితో కూడిన మంత్రివర్గం ఆదివారం సాయంత్రం రాజ్​భవన్ (Raj bhavan)​లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్​ భన్వరిలాల్​ పురోహిత్​ (Bhanwarilal purohit) వీరందరితో ప్రమాణం చేయించారు. 15 మంది మంత్రుల (ministers)లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది.​ 15 మంది మంత్రుల జాబితాలో బ్రహ్మ్ మొహీంద్ర, మన్ ప్రీత్ సింగ్ బాదల్, ట్రిప్ట్ రజిందర్ సింగ్ బజ్వా, సుఖ్ బింద్ర సింగ్ సర్కారియా, రానా గుర్జీత్ సింగ్, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ అశు, విజేంద్ర సింఘ్లా, రణ్ దీప్ సింగ్ నభా, రాజ్ కుమార్ వెర్కా, సంగత్ సింగ్ గిల్జియాన్, పర్వత్ సింగ్, అమర్ సింగ్ రాజా వారింగ్, గుర్​కీరత్ సింగ్ కోట్లి. నభా, వెర్కా, గిల్జియాన్, పర్గత్ సింగ్, వారింగ్, కోట్లిలు ఉన్నారు.

  వారికి ఉద్వాసన..

  ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సిద్ధూ, క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి, ఆర్థిక శాఖ మంత్రి గుర్ ప్రీత్ సింగ్ కంగర్, పరిశ్రమలశాఖ మంత్రి సుందర్ షామ్ అరోరా, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి సాధు సింగ్ ధరమ్‌సాట్‌లను చరణ్‌జీత్ సింగ్ నూతన కేబినెట్ లోకి తీసుకోలేదు. మాజీ సీఎం అమరీందర్ విశ్వాసపాత్రులైన మొహింద్రా, విజేంద్ర సింఘ్లా, భ‌ర‌త్ భూష‌ణ్ అషుల‌కు కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

  చరణ్​ సింగ్​ మార్క్​..

  పంజాబ్​ (Punjab) రాజకీయాల్లో వేడి ఏమాత్రం తగ్గలేదు. పీసీసీ చీఫ్​ పదవి చేజిక్కించుకుని దేశంలో వార్తల్లోకెక్కిన నవ్యజోత్​సింగ్​ సిద్దూ ఎపిసోడ్ నుంచి పంజాబ్​ వార్తల్లో నిలిచింది. ఇరువురి మధ్య సఖ్యత లేకపోవడంతో పంజాబ్​లో చరిష్మా కలిగిన సిద్దూ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. సీఎం పదవికి అమరీందర్​ రాజీనామా (Resign) సైతం చేయాల్సి వచ్చింది. ఇక వెంటనే తనకు దగ్గరి వారైన చరణ్​సింగ్​ చన్నీ (Charansingh channi)ని సీఎం పీఠం ఎక్కించేందుకు సిద్దూ పావులు కదిపాడని రాజకీయ వర్గాల్లో చర్చలు నడిచాయి.

  పంజాబ్​కు తొలి దళిత ఎమ్మెల్యే (First Dalit Chief Minister)ను సీఎం చేసిన ఘనతై తే కాంగ్రెస్​ దక్కించుకుంది కానీ, ఆ పేరు ఎంతవరకు నిలబెడుతుంది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పవర్​ (Power) అంతా సిద్దూ చేతిలోనే ఉంటుందని ప్రతిపక్షాలు (oppositions) విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన  వారం తర్వాత పంజాబ్​లో మంత్రివర్గం (cabinet) కొలువు దీరింది. అయితే ఈ మంత్రివర్గ కూర్పుతో చన్నీ తన మార్కు చూపించవచ్చని, ప్రతిపక్షాల నోరు మూయించే దిశలో అడుగులు వేస్తాడని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

  ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నూతన మంత్రివర్గంతో రాజ్‌భవన్ (raj bhavan) లో ప్రమాణ స్వీకారం చేయించారు.  ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ ఇప్పటివరకూ మూడు పర్యాయాలు ఢిల్లీ (Delhi)కి వెళ్లొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలతో చర్చించిన పంజాబ్ కొత్త సీఎం నూతన మంత్రివర్గం జాబితాను సిద్ధం చేశారు. పదిహేను మందితో కేబినెట్ (cabinet) జాబితా సిద్ధం చేయగా.. ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖల మంత్రులకు ఉద్వాసన పలికారు. ఆరుగురు కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకుని చరణ్​సింగ్​ సన్నీ తన పట్టును నిలుపుకోవాలని చూస్తున్నట్లుగానే ఉంది.

  ఇటీవల పనిచేసిన ఐదుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోగా, ఆరుగురు కొత్త వారికి (6 new members) కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయ వాతావరణం నెలకొంది..
  Published by:Prabhakar Vaddi
  First published: