Home /News /politics /

NEW CABINET ELECTED IN PUNJAB TODAY AND NEWS THAT FIVE NEW MEMBERS OF AMARINDERS TEAM ARE BEING SACKED PRV

Punjab politics: పంజాబ్​లో నేడు కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం.. అమరీందర్​ టీమ్​లోని ఆ ఐదుగురికి ఉద్వాసన ​?

పంజాబ్ నేతలు  (ఫైల్​)

పంజాబ్ నేతలు (ఫైల్​)

కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా ఇంకా తన టీమ్​ని ప్రకటించలేదు చరణ్​సింగ్​. నేడు పంజాబ్​లో మంత్రివర్గం (cabinet) కొలువు దీరనుంది. అయితే ఈ మంత్రివర్గ కూర్పుతో చన్నీ తన మార్కు చూపించవచ్చని, ప్రతిపక్షాల నోరు మూయించే దిశలో అడుగులు వేస్తాడని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    పంజాబ్​ (Punjab) రాజకీయాల్లో వేడి ఏమాత్రం తగ్గలేదు. పీసీసీ చీఫ్​ పదవి చేజిక్కించుకుని దేశంలో వార్తల్లోకెక్కిన నవ్యజోత్​సింగ్​ సిద్దూ ఎపిసోడ్ నుంచి పంజాబ్​ వార్తల్లో నిలిచింది. ఇరువురి మధ్య సఖ్యత లేకపోవడంతో పంజాబ్​లో చరిష్మా కలిగిన సిద్దూ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. సీఎం పదవికి అమరీందర్​ రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. ఇక వెంటనే తనకు దగ్గరి వారైన చరణ్​సింగ్​ చన్నీ (Charansingh channi)ని సీఎం పీఠం ఎక్కించేందుకు సిద్దూ పావులు కదిపాడని రాజకీయ వర్గాల్లో చర్చలు నడిచాయి. పంజాబ్​కు తొలి దళిత ఎమ్మెల్యేను సీఎం చేసిన ఘనతై తే కాంగ్రెస్​ దక్కించుకుంది కానీ, ఆ పేరు ఎంతవరకు నిలబెడుతుంది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పవర్​ అంతా సిద్దూ చేతిలోనే ఉంటుందని ప్రతిపక్షాలు (oppositions) విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా ఇంకా తన టీమ్​ని ప్రకటించలేదు చరణ్​సింగ్​. నేడు పంజాబ్​లో మంత్రివర్గం (cabinet) కొలువు దీరనుంది. అయితే ఈ మంత్రివర్గ కూర్పుతో చన్నీ తన మార్కు చూపించవచ్చని, ప్రతిపక్షాల నోరు మూయించే దిశలో అడుగులు వేస్తాడని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

    పంజాబ్ ముఖ్యమంత్రి చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీ కేబినెట్‌లో 15 మంది (15 members) పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం కేబినెట్ లోకి రానున్న నేతల పేర్లు ప్రకటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే కొలువు దీరనున్న నూతన మంత్రివర్గం (new cabinet) జాబితాను ఇప్పటికే పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు పంపినట్లు సమాచారం.  కొత్త వ్యక్తులకు మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

    ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నూతన మంత్రివర్గంతో రాజ్‌భవన్ (raj Bhavan) లో ప్రమాణ స్వీకారం చేయనుంది. సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్ జీత్ సింగ్ ఇప్పటివరకూ మూడు పర్యాయాలు ఢిల్లీ (Delhi)కి వెళ్లొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలతో చర్చించిన పంజాబ్ కొత్త సీఎం నూతన మంత్రివర్గం జాబితాను సిద్ధం చేశారు. పదిహేను మందితో కేబినెట్ (cabinet) జాబితా సిద్ధం చేయగా.. ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖల మంత్రులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఆరుగురు కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకుని చరణ్​సింగ్​ సన్నీ తన పట్టును నిలుపుకోవాలని చూస్తున్నట్లుగానే ఉంది.

    ఇటీవల పనిచేసిన ఐదుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోగా, ఆరుగురు కొత్త వారికి (6 new members) కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయ వాతావరణం నెలకొంది. ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సిద్ధూ, క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి, ఆర్థిక శాఖ మంత్రి గుర్ ప్రీత్ సింగ్ కంగర్, పరిశ్రమలశాఖ మంత్రి సుందర్ షామ్ అరోరా, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి సాధు సింగ్ ధరమ్‌సాట్‌లను చరణ్‌జీత్ సింగ్ నూతన కేబినెట్ లోకి తీసుకోలేదని సమాచారం. మాజీ సీఎం అమరీందర్ విశ్వాసపాత్రులైన మొహింద్రా, విజేంద్ర సింఘ్లా, భ‌ర‌త్ భూష‌ణ్ అషుల‌కు కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Politics, Punjab

    తదుపరి వార్తలు