సీఎంగా కుమారస్వామి వద్దనుకున్నాను..: దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు

సంకీర్ణ ప్రభుత్వానికి కుమారస్వామిని సీఎంగా చూడాలనుకోలేదని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ రాహుల్ సూచన మేరకు కుమారస్వామిని సీఎం చేయడం తప్పలేదన్నారు.

news18-telugu
Updated: June 21, 2019, 11:44 AM IST
సీఎంగా కుమారస్వామి వద్దనుకున్నాను..: దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
కుమారస్వామి, దేవెగౌడ (File:PTI)
  • Share this:
జనతాదళ్ సెక్యులర్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి కుమారస్వామిని తాను సీఎంగా చూడాలనుకోలేదని బాంబు పేల్చారు. తనయుడిపై దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి తాను మల్లిఖార్జున ఖర్గే పేరును సీఎంగా ప్రతిపాదించానని.. కానీ రాహుల్ గాంధీ మాత్రం కుమారస్వామిని సీఎంగా నియమించాలని తనకు కబురు పంపారని వెల్లడించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత సోనియా, రాహుల్.. గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లను నా వద్దకు పంపించారు. ఆ సందర్భంగా జరిగిన చర్చల్లో.. సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా గతంలో నేను ఎదుర్కొన్న ఆటంకాలు, చేదు అనుభవాల గురించి వివరించాను. కాబట్టి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నేను ఒప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ ఒత్తిడి మేరకు తప్పలేదు.
దేవెగౌడ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు


కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు తప్పేలా లేవని కూడా దేవెగౌడ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలిచే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కుమారస్వామి, కాంగ్రెస్ చేతుల్లోనే ప్రభుత్వం నిలబడేది లేనిది ఆధారపడి ఉందన్నారు.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>