ఏపీ డిప్యూటీ సీఎం టిక్ టాక్... మండిపడుతున్న నెటిజన్స్

సీఎం జగన్‌ను పొగుడుతూ ఉన్న ఓ పాటను అనుకరిస్తూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: January 1, 2020, 3:18 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం టిక్ టాక్... మండిపడుతున్న నెటిజన్స్
పాముల పుష్పశ్రీవాణి (File Photo)
  • Share this:
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో చేశారు. సీఎం జగన్‌ను పొగుడుతున్న ఓ పాటతో ఆమె టిక్ టాక్ చేశారు. దీంతో పుష్ప శ్రీవాణి వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీన్ని చూసిన కొందరు.. మాత్రం ఆమె తీరుపై మండిపడుతున్నారు. పాలన గాలికి వదిలేసి డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మన ప్రజలు గురించి ఆలోచించారు టిక్ టాక్ వీడియోలు మాత్రం చేస్తారంటూ విమర్శిస్తున్నారు.రాజధాని తగులబడుతుంటే మరోవైపు డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియో చేసుకుంటున్నారు ఇటు టీడీపీ సైతం తన ట్విట్టర్‌లో పేర్కొంది.

సీఎం జగన్‌ను పొగుడుతూ ఉన్న ఓ పాటను అనుకరిస్తూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అనే పాటతో ఆమె టిక్ టాక్ వీడియో చేశారు శ్రీవాణి. ఈ పాట ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి టిక్ టాక్‌లో ఇలా చేయడం గురించి సోషల్ మీడియాలో పలురకాల కామెంట్స్ వస్తున్నాయి. ఉతరాంధ్రకు చెందిన విశాఖను ఏపీ పరిపాలన రాజధాని చేయాలని ఇటీవల సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాంధ్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఈరకంగా టిక్ టాక్ చేసి సీఎం జగన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.First published: January 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు