బోటు ప్రమాదంతో బుక్కైన రోజా... ఆటాడుకుంటున్న నెటిజన్స్

గతంలో దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంతో సరిపోల్చుతూ... నెటిజన్లు జగన్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.

news18-telugu
Updated: September 16, 2019, 9:38 AM IST
బోటు ప్రమాదంతో బుక్కైన రోజా... ఆటాడుకుంటున్న నెటిజన్స్
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో తాజాగా జరిగిన లాంచీ ప్రమాదంలో పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు పోగుట్టుకున్నారు. గల్లంతైన వారిలో ఏపీతో పాటు తెలంగాణకు చెందినవారు కూడా ఉండటంతో ఈప్రమాదం తెలుగురాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. అయితే బోటు ప్రమాదంపై స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసి... మృతుల కుటుంబాలకు పదిలక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. తాజాగా జరిగిన ప్రమాదాన్ని గతంలో దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంతో సరిపోల్చుతూ... నెటిజన్లు జగన్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.

ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా అప్పుడు చేసిన కామెంట్లను పోస్టు చేస్తూ... ఆమెను ప్రశ్సిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు జరిగిన బోటు ప్రమాదంపై గుండెలు బాదుకున్న రోజా.. ఇప్పుడు సమాధానం ఇస్తావా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ రోజా అమ్మ ఈ రోజు జరిగిన గోదావరి బోటు ప్రమాదంకి ఆన్సర్ ఇస్తావా లేక టూరిజం మిన్స్టర్ తో రాజీనామా చేయఇస్తావా’ అంటూ నెటిజన్లు కొందరు రోజాపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన బోటు ప్రమాదంపై రోజా చేసిన వ్యాఖ్యల్ని కూడా వీడియో రూపంలో పోస్టు పెట్టి వైరల్ చేస్తున్నారు.మరో నెటిజన్ ‘ గోదావరి ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ ఎవరెవరు రాజీనామాలు చేస్తున్నారు..? YCP భాషలో చెప్పాలంటే .. "ఈ హత్యలు ఎవరు చేసినట్టు"..? గత ప్రభుత్వంలో ఏచిన్న పొరపాటు జరిగినా లబో-దిబో మంటూ గుండెలు బాదుకున్న 'రోజా' ఈరోజు ఘటనపై బాదుకోలేదే..? ముఖ్యమంత్రి రాజీనామాను కొరలేదే..?అంటూ ట్వీట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. మరి నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading