మోదీ, ట్రంప్‌పై నెటిజన్ల ఆగ్రహం.. పర్యావరణం అంటూ లెక్చర్లు దంచి..

మోదీ, ట్రంప్ భేటీ సందర్భంగా చోటుచేసుకున్న ఓ సంఘటన వారిద్దరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 25, 2019, 12:56 PM IST
మోదీ, ట్రంప్‌పై నెటిజన్ల ఆగ్రహం.. పర్యావరణం అంటూ లెక్చర్లు దంచి..
మోదీ, ట్రంప్ మీడియా సమావేశం సందర్భంగా దర్శనమిచ్చిన ప్లాస్టిక్ బాటిల్
  • Share this:
అంతకు కొద్దిసేపటికి క్రితమే ఇండియా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యావరణ పరిరక్షణపై ఉపన్యాసం ఇచ్చారు.. మాటలు చాలని, చేతలు చూపాలని మోదీ కామెంట్ చేయగా.. పర్యావరణం కోసం ప్రపంచ దేశాలన్నీ కదిలి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఆ తర్వాత కాసేపటికే మోదీ, ట్రంప్ మధ్య భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే.. ఆ భేటీ సందర్భంగా చోటుచేసుకున్న ఓ సంఘటన వారిద్దరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది. అసలేం జరిగిదంటే.. ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై మోదీ, ట్రంప్ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటూ, ఇరు దేశాల అభివృద్ధి కోసం తాము తీసుకోబోయే పలు నిర్ణయాలపై మీడియాకు వివరించారు. అయితే, అప్పుడే ఒక వస్తువు మీడియా కెమెరాకు చిక్కింది.

అంతే.. ఇంకేముంది నెటిజన్లు ఆ వస్తువును జూమ్ చేసుకుంటూ ఇరు దేశాధినేతలపై నిప్పులు చెరిగారు. ఆ వస్తువు ఏంటంటే.. కోకాకోల కంపెనీకి చెందిన డైట్ కోక్ దర్శనం ఇవ్వడమే. దానికే అంత కోపమా అనుకుంటున్నారా? ఆ డైట్ కోక్ ఉన్నది ప్లాస్టిక్ బాటిల్‌లో. తమ ప్రతాపం చూపించే సమయం వచ్చిందంటూ నెట్టింట్లో వాళ్లను తిట్టిపోశారు. పర్యావరణం గురించి లెక్చర్లు దంచి, ఇప్పుడు మీరే ప్లాస్టిక్ వినియోగిస్తున్నారేంటని కామెంట్లతో హోరెత్తించారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన మోదీ.. ప్లాస్టిక్ బాటిల్ వాడుతున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ ఘటనపై ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. ‘ఈ సమావేశం కోసం అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ట్రంప్ రెగ్యులర్‌గా డైట్ కోక్ తాగుతారు. ఆయన్ను దృష్టిలో ఉంచుకొని అధికారులు అక్కడ దాన్ని ఏర్పాటు చేశారు. దానితో భారత్‌కు సంబంధం లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు