Home /News /politics /

NETIZEN HELD FOR POSTING OBJECTIONABLE CONTENT AGAINST NARA LOKESH SB

నారా లోకేష్‌పై అసభ్యకర పోస్టు... పోలీసులకు టీడీపీ ఫిర్యాదు

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

మరోవైపు నారా లోకేష్ గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ... కొన్ని పోస్టులు పెడుతున్నారు.

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి లోకేష్‌పై అసభ్యవ్యాఖ్యలు చేస్తూ... దృశ్యాలతో కూడిన పోస్టును పెట్టారు. దీంతో ఆ పారటీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య... పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే ప్రభాకర్ రెడ్డి పెట్టిన పోస్టు ఉందంటూ... తాడేపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 3వతేదీన ఈ పోస్టును గమనించి ప్రభాకరరెడ్డి గురించి ఆరా తీయగా, అతడు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నాడని తెలిసింది. ప్రభాకర్ రెడ్డి ప్రవాస భారతీయుడని, వైసీపీ సానుభూతిపరుడని తేలిందన్నారు. ఈ మేరకు ప్రభాకరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిందితుడి వ్యాఖ్యలతో కూడిన సీడీలను వర్ల పోలీసులకు అందజేశారు.

    మరోవైపు నారా లోకేష్ గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ... కొన్ని పోస్టులు పెడుతున్నారు.తాజాగా జగన్ పై ఆయన మరో ట్వీట్ చేశారు. ‘కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారు, ఏపీకి రావాల్సిన నిధులు,హక్కులు గాలికొదిలారు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నారు, కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారు. @ysjagan గారు మీకు 22 ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుంచి జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ సాధించారు.’ అంటూ ఏపీ సీఎం తీరుపై లోకేష్ ట్వీట్ చేశారు. అయితే టీడీపీ నేతలు చేస్తున్న ట్విట్టర్ వ్యాఖ్యలపై... వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన కూడా వీటికి ధీటుగా సమాధానమిస్తున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Nara Lokesh, Twitter

    తదుపరి వార్తలు