• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NETAS WHO DONT FULFILL PROMISES GET THRASHED BY PUBLIC NITIN GADKARI SB

‘జనతా ఉన్‌కి పిటాయి కరేగి’ నేతలకు నితిన్ గడ్కరీ వార్నింగ్

‘జనతా ఉన్‌కి పిటాయి కరేగి’ నేతలకు నితిన్ గడ్కరీ వార్నింగ్

నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి (ఫైల్ ఫోటో )

ఎన్నికల్లో గెలుపు కోసం హామీలపై హామీల వర్షం కురిపించిన నాయకులను ఎన్నికల ముందు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హామీల వర్షం కురిపించిన నాయకులంతా వాటిని అమలు చేయకుంటే ప్రజలు పబ్లిక్‌లోనే బడితపూజె చేస్తారంటూ హెచ్చరించారు.

  • Share this:
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం హామీలపై హామీల వర్షం కురిపించిన నాయకులను ఎన్నికల ముందు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హామీల వర్షం కురిపించిన నాయకులంతా వాటిని అమలు చేయకుంటే ప్రజలు పబ్లిక్‌లోనే బడితపూజె చేస్తారంటూ హెచ్చరించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం జనాలకు నాయకులు ఎన్నో కలలు చూపిస్తుంటారు. వాటిని నిజం చేయకపోతే మాత్రం ఆ నేతల్ని జనం ఊరికే వదలు పెట్టరన్నారు. అందుకే అములుకు వీలయ్యే హామీల్నే ప్రజలకు ఇవ్వాలన్నారు. వాటిని తప్పకుండా పూర్తి చేయాలన్నారు. అప్పుడే జనం ప్రజాప్రతినిధుల్ని నమ్ముతారన్నారు.

అంతేకాదు... తాను అందరి నాయకుల్లాంటివాడని కాదన్నారు గడ్కరి. ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని వంద శాతం పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. శివసేన-బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో (1995-99) అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర PWD మంత్రిగా పనిచేశారు గడ్కరీ. తాను PWD మంత్రిగా ఉన్నప్పుడు ముంబైలో 50 ఫ్లైఓవర్లు నిర్మిస్తానంటూ అందరు నవ్వరన్నారు. కానీ ... ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేశానన్నారు. దీనివల్ల ముంబై-పూణెకు మధ్య ప్రయాణ సమయం దాదాపుగా రెండు గంటలు ఆదా అయ్యిందన్నారు. ముంబై మీడియాకు తానెలాంటి వ్యక్తినో బాగా తెలుసన్నారు. అందుకే వారంతా తనపై విశ్వాసం ఉంచుతారన్నారు.

మరోవైపు గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు స్పందిస్తున్నారు. గడ్కరీ మాటలు బీజేపీ పాలనకు అద్దం పడుతున్నాయంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ. గతంలో కూడా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చామని ఒప్పుకున్నారు. తామిచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు, వాటిని నెరవేర్చాలన్న ప్రయత్నం ఆచరణ సాధ్యం కావడం లేదని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉండి కూడా పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో గడ్కరీ ఏమాత్రం వెనక్కి తగ్గరు.

First published: