నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెచ్చిపోయారు. నడిరోడ్డుపై నరికేస్తానంటూ ఓ జర్నలిస్టును తీవ్రంగా హెచ్చరించారు. అంతటితో ఆగక.. తీవ్ర అసభ్య పదజాలంతో అతన్ని దూషించారు. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సదరు జర్నలిస్టును ఆయన హెచ్చరించారు. సదరు జర్నలిస్టు తాను ఆదాల ప్రభాకర్ రెడ్డి మనిషిని అని చెప్పడంతో.. 'ప్రభాకర్ రెడ్డితో చెప్పుకో.. నిన్నెవరు కాపాడుతారో చూస్తా' అంటూ విరుచుకుపడ్డారు. తోలు తీస్తానంటూ హెచ్చరించిన శ్రీధర్ రెడ్డి.. చెప్పరాని పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఏ విషయంలో సదరు జర్నలిస్టు ఎమ్మెల్యేపై పోస్టులు పెట్టాడు..? ఎమ్మెల్యే ఎందుకింత ఫైర్ అవాల్సి వచ్చిందన్నది ఇంకా తెలియరాలేదు.దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ ఈ ఆడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.