NELLORE RURAL YSRCP MLA KOTAMREDDY SRIDHAR REDDY REPLY TO NARA LOKESH AUDIO AK
వాడు ఓ సన్నాసి... లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
నెల్లూరు జిల్లాలో జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తితో తాను మాట్లాడిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఆడియోగా రిలీజ్ చేశారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు.
తాను ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించినట్టు టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్ చేసిన ఆడియోపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లాలో జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తితో తాను మాట్లాడిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఆడియో రిలీజ్ చేశారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు తమ కుటుంబంపై సదరు వ్యక్తి దుష్ప్రచారం చేయడం వల్లే... తాను ఇలా చేశానని వివరించారు. గతంలో ఇలాగే చంద్రబాబు కుటుంబంపై వార్తలు రాసిన ఓ విలేఖరిని ఆయనే హత్య చేయించారనే ప్రచారం ఉందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఇలాంటి వాటిని ప్రచారం చేయడాన్న లోకేశ్ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా ప్రజల్లో తిరిగి మంచి ప్రతిపక్షంగా ఉండాలని సూచించారు. అంతకుముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరిని బెదిరించారంటూ నారా లోకేశ్ ట్విట్టర్లో ఆడియోను పోస్ట్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యే దీనిపై వివరణ ఇచ్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.