Home /News /politics /

NELLORE RURAL YSRCP MLA KOTAMREDDY SRIDHAR REDDY COMMENT ON SAND SHORTAGE IN AP AK

సీఎం జగన్‌కు ఇరుకున పెట్టేలా వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక కొరతపై మాట్లాడిన కోటంరెడ్డి...కొందరు ప్రభుత్వ విధానాన్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

    కొద్దిరోజుల క్రితం వివాదంతో వార్తల్లోకి ఎక్కిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... తాజాగా సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక కొరతపై మాట్లాడిన కోటంరెడ్డి... ప్రభుత్వ విధివిధానాలను పక్కనపెడుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా ఇసుక పాలసీ విధానాన్ని తమ సొంతానికి, అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యుడికి ఇసుక అందని రీతిలో దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్, నగర ప్రజల ఇక్కట్లు, భవన నిర్మాణ కార్మికుల బాధల్ని తీర్చేందుకు ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు.

    నెల్లూరు రూరల్, నగర ప్రజల ఇక్కట్లు, భవన నిర్మాణ కార్మికుల బాధల్ని గమనించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాణి మధ్య కొద్దిరోజుల క్రితం విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో... ప్రస్తుతం కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకాణి టార్గెట్‌గానే చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇసుక కొరతపై ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు పోరాటం చేస్తున్న సమయంలో కోటంరెడ్డి వ్యాఖ్యలు వైసీపీకి, సీఎం జగన్‌కి ఇబ్బంది కలిగేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kotamreddy sridhar reddy, Nellore, Ysrcp

    తదుపరి వార్తలు