కశ్మీర్ విషయంలో నెహ్రూపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (File Photo)

కశ్మీర్‌లో ఫోన్ కాల్ సర్వీసులను రద్దు చేయడంపై కొంతమంది గోల చేస్తున్నారని.. ఫోన్ కాల్ కనెక్షన్ అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని అన్నారు. కశ్మీర్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.

 • Share this:
  స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో కశ్మీర్ సమస్యపై నెహ్రూ ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం కోరి.. హిమాలయ పర్వతాల కంటే పెద్ద తప్పు చేశాడని మండిపడ్డారు. అది నెహ్రూ ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా.. వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమమని విమర్శించారు. సర్దార్ పటేల్ 630 సంస్థానాలను విలీనం చేయగలిగితే.. నెహ్రూ ఒక్క కశ్మీర్‌‌ను భారత్‌లో విలీనం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ చేయలేని పని 2019లో బీజేపీ చేసిందని.. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసిందని చెప్పారు. అదే సమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆయన పొగిడారు. సిమ్లా ఒప్పందం ద్వారా కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక సమస్యగా ఉంచారన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

  కశ్మీర్‌లో ఆంక్షలను ఇంకా సడలించలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కశ్మీర్‌లో ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు
  అమలులో లేవన్నారు. కశ్మీర్‌లోని మొత్తం 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు చెప్పారు. కేవలం 8 పోలీస్ స్టేషన్ల
  పరిధిలో మాత్రమే 144సెక్షన్ అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ఐరాస సర్వ ప్రతినిధి సమావేశంలో కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని అన్ని దేశాల నేతలు సమర్థించారని చెప్పారు. ఏ ఒక్క దేశాధినేత కూడా భారత్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్నారు. ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయం అన్నారు.కశ్మీర్‌లో ఫోన్ కాల్ సర్వీసులను రద్దు చేయడంపై కొంతమంది గోల చేస్తున్నారని.. ఫోన్ కాల్ కనెక్షన్ అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని అన్నారు. కశ్మీర్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.

  First published: