Home /News /politics /

NEELAM SAHANI LIKELY TO BE AP NEW CHIEF SECRETARY AFTER AP CM YS JAGAN TRANSFERS CS LV SUBRAMANYAM BA

జగన్ మరో కీలక నిర్ణయం.. కొత్త సీఎస్‌గా మహిళకు చాన్స్?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నీలం సహానీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నీలం సహానీ

సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఈరోజే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో లంచ్ మీటింగ్ అయినట్టు సమాచారం. ఆ తర్వాతే చీఫ్ సెక్రటరీ బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.

    ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు వేసింది. జీవోల విడుదలతో జాప్యం చేస్తున్నారనే కారణంతో ఆయనను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్.. చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ప్రస్తుతం భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషన్ నీరబ్ కుమార్‌కు సీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

    ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే విధుల్లో చేరిపోవాలి. అయితే, ఎల్వీ సుబ్రమణ్యం తర్వాత చీఫ్ సెక్రటరీ ఎవరు కాబోతున్నారనే ఆసక్తి అటు ఉద్యోగ వర్గాలు, ఇటు రాజకీయవర్గాల్లోనూ నెలకొంది. అయితే, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. సీఎస్ రేసులో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు నీలం సహానీ. మరొకరు సమీర్ శర్మ.

    సమీర్ శర్మ , ఐఏఎస్ (File)


    నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఈరోజే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో లంచ్ మీటింగ్ అయినట్టు సమాచారం. ఆ తర్వాతే చీఫ్ సెక్రటరీ బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.

    నీలం సహానీతో పాటు సీఎస్ రేసులో సమీర్ శర్మ ఉన్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2021 నవంబర్ వరకు సమీర్ శర్మ పదవీకాలం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP CS LV Subramanyam, LV Subramanyam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు