• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • NDA OR UPA WHO EVER YS JAGAN MOHAN REDDY SUPPORTS YSRCP MAY LOOSE MINORITY VOTES IN FUTURE BA

జగన్ నిర్ణయంతో వైసీపీ కోటకు బీటలు.. ముందు నుయ్యి - వెనుక గొయ్యి..

జగన్ నిర్ణయంతో వైసీపీ కోటకు బీటలు.. ముందు నుయ్యి - వెనుక గొయ్యి..

జగన్ మోహన్ రెడ్డి (File)

ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఎన్డీయే వైపు మొగ్గితే మైనార్టీలు, ఎస్సీలు వైసీపికి దూరమయ్యే అవకాశం ఉంది. యూపీఏకు దగ్గరైతే వైసీపీ కేడర్‌ను కాంగ్రెస్ తమ వైపు తిప్పుకొనే చాన్స్ ఉంది.

 • Share this:
  ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి వైసీపీ అత్యధిక ఎంపీ సీట్లు గెల్చుకోవడం ఖాయమనే అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ కేంద్రంలో ఎవరికి మద్దతివ్వబోతోంది? తద్వారా వైసీపీ ఓటుబ్యాంకుపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనిపై వైసీపీ నేతలతో పాటు ఈసారి ఆ పార్టీకి ఓటు వేసిన వర్గాలు దీనిపై సీరియస్ గానే చర్చించుకుంటున్నాయి. ఏపీలో 2011 వరకూ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు ఆ తర్వాత వైసీపీ రాకతో జగన్‌కు జై కొట్టాయి. 2014 వరకూ కాస్తో కూస్తో కాంగ్రెస్ వైపు నిలిచిన ఆయా వర్గాలు రాష్ట్ర విభజనతో పూర్తిగా హస్తం పార్టీకి దూరమయ్యాయి. దీని ప్రభావం 2014 ఎన్నికల్లో స్ఫష్టంగానే కనిపించింది. ఓవైపు మోదీ, పవన్ తో జోడీ కట్టి ఎన్నికల బరిలోకి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో పోటాపోటీగా వైసీపీ ఓట్లు, సీట్లు సాధించడం వెనుక బలమైన కారణమిదే. ఆ తర్వాత కూడా వైసీపీకి ఆయా వర్గాల మద్దతు కొనసాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటికొచ్చిన తర్వాత టీడీపీ నేతలు.. వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో మోదీ, జగన్ కుమ్మక్కయ్యారంటూ ఓ వాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీ అనుసరించిన ఏకపక్ష వైఖరే అందుకు కారణం.

  YSRCP with Congress,YS Jaganmohan Reddy Rahul Gandhi,YCP Support to Congress,YSRCP support to BJP,YS Jagan PM Modi,YCP Support to whom?,Ummareddy venkateswarlu,Ummareddy,YSRCP Leader Ummareddy,YCP wont join Congress,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్‌తో కలవబోమన్న వైసీపీ,వైసీపీ కాంగ్రెస్ పొత్తు,వైసీపీ బీజేపీ పొత్తు,జగన్ మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ,జగన్ మోదీ
  రాహుల్ గాంధీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)


  మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ నేతలు జగన్ - బీజేపీతో కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపణలు కొనసాగించారు. అయితే ఇప్పటివరకూ ఓ ఎత్తు. ఫలితాల తర్వాత మరో ఎత్తు. ఓసారి ఫలితాలు వెలువడ్డాక కేంద్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ లేక కూటమికి తాము మద్దతిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ పలుమార్లు ప్రకటించారు. ఇందులో యూపీఏతో పాటు ఎన్డీయే కూడా ఉన్నట్లే. దీంతో జగన్ గతంలో తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని మర్చిపోయి యూపీఏకు మద్దతిస్తారా లేక తన ఓటు బ్యాంకుకు సరిగ్గా వ్యతిరేకమైన ఎన్టీయేకు అండగా నిలుస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

  COngress,YSRCP,TDP,Chandrababu Naidu,Rahul Gandhi,YS Jaganmohan Reddy,Lok Sabha elections 2019,Post poll alliance,COngress alliance with tdp,Congress alliance with YS Jagan YSRCP,చంద్రబాబునాయుడు,టీడీపీ,కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ,వైఎస్ జగన్,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,ఎన్నికల తర్వాత పొత్తులు,ఎన్నికల పొత్తులు,
  జగన్ మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు


  ప్రత్యేక హోదా అంశంపైనే తన మద్దతు అంటున్న జగన్ యూపీఏకు లేదా ఎన్డీయేకు మద్దతివ్వడం ద్వారా ఆయనకు తక్షణం వచ్చే ముప్పేమీ ఉండదు. కానీ దీర్ఘకాలంలో లేదా వచ్చే ఎన్నికల్లో జగన్ పై ప్రభావం తప్పక ఉండే అవకాశముంటుంది. ఇందులో జగన్ ఎన్డీయేకు మద్దతిస్తారని అనుకుంటే దీన్ని వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు, ఎస్సీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంటుంది. సరిగ్గా ఇదే అంశాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలూ ఎక్కువగా ఉంటాయి. అందుకే జగన్ నేరుగా ఎన్డీయేలో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఒకవేళ అత్యధిక సీటు సాధించే ఎన్డీయేకు మద్దతివ్వాల్సిన పరిస్ధితే వస్తే గతంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి టీడీపీ బయటినుంచి మద్దతిచ్చిన తరహాలో జగన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.

  Ap elections 2019, Andhra Pradesh assembly elections 2019, Andhra Pradesh lok sabha elections 2019, ysrcp, ys jagan mohan reddy, ycp, ys jagan, bjp to attract ysrcp with special status to ap, bjp special status promise to ap, ap scs, congress, tdp, pm modi, amit shah, tdp, chandrababu naidu, ఏపీ ఎన్నికలు 2019, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలు 2019, వైసీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ, వైఎస్ జగన్, ప్రత్యేక హోదాతో వైసీపీని ఆకర్షించనున్న బీజేపీ, ఏపీ ప్రత్యేక హోదా, ప్రధాని మోదీ, అమిత్ షా, టీడీపీ, చంద్రబాబునాయుడు
  ప్రధాని మోదీతో వైఎస్ జగన్ భేటీ(ఫైల్ ఫోటో)


  ఒకవేళ యూపీఏ అత్యధిక సీట్లు సాధించే పరిస్ధితి ఉంటే, జగన్ యూపీఏ కూటమిలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. వైసీపీ నేరుగా యూపీఏలో చేరడం వల్ల కూడా ఆ పార్టీకి తక్షణం ఎలాంటి నష్టం ఉండబోదు. ఇద్దరి ఓటు బ్యాంకూ ఒకటే, అభిప్రాయాలు కూడా దాదాపు ఒకటే. కాంగ్రెస్ నేతలు సహజంగానే తమ నేత వైఎస్ఆర్ కుమారుడిగా జగన్ ను ఆదరించే అవకాశాలు ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీ తన సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను వైసీపీ నుంచి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయొచ్చు. ఈ వ్యవహారం జగన్, కాంగ్రెస్ మధ్య మరో యుద్ధానికి కూడా దారి తీయొచ్చు.

  evm,vvpats,suprem court,central election commission,ec,politics,ap politics, ap news, chandrababu in delhi, chandrababu meets rahul gandhi, chandrababu meets CJI, ఢిల్లీలో చంద్రబాబు, రాహుల్‌తో చంద్రబాబు,Chandrababu on Rahul Gandhi, Chandrababu on congress, TDP, PM modi, రాహుల్ గాంధీపై చంద్రబాబు, కాంగ్రెస్‌పై చంద్రబాబు, టీడీపీ, ప్రధాని మోదీ,తెలంగాణ, కాంగ్రెస్, టీడీపీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, టీఆర్ఎస్, congress, tdp, Rahul Gandhi, chandrababu,trs,babu,బాబు,bjp,బీజేపీ,మోదీ,ఈసీ, ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం,
  రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు (ఫైల్ ఫొటో)


  స్ధూలంగా చూసుకుంటే ఎన్డీయే కంటే యూపీఏవైపు మొగ్గడం వల్లే దీర్ఘకాలంలో జగన్ కు ప్రయోజనకరంగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనాగా కనిపిస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు ఇతర అంశాల్లోనూ జగన్ కు ఈ వ్యూహం లాభించవచ్చనే అంచనాలున్నాయి.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్ 18)
  Published by:Ashok Kumar Bonepalli
  First published: