వాయనాడ్‌లో రాహుల్‌పై పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి ఎవరో తెలుసా ?...

వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్న నేపథ్యంలో...పొత్తులో ఉన్న ఈ సీటును ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నుంచి వెనక్కి తీసుకొని బలమైన అభ్యర్థిని బీజేపీ నిలబెడుతుందని అంతా భావించారు. అయితే వాయనాడ్‌ను మిత్రపక్షానికే వదిలేయడం గమనార్హం.

news18-telugu
Updated: April 1, 2019, 7:21 PM IST
వాయనాడ్‌లో రాహుల్‌పై పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి ఎవరో తెలుసా ?...
రాహుల్ పై పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లి..
  • Share this:
కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని ప్రకటించి 24 గంటలైనా గడవక ముందే, ఎన్డీఏ సైతం రాహుల్‌పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన భారత ధర్మ జనసేన తరపున తుషార్ వెల్లప్పల్లి వాయనాడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తుషార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేశారు. ఎన్డీఏ కేరళలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇదిలా ఉంటే అమేథితో పాటు దక్షిణ భారత దేశం నుంచి పోటీచేయాలని నిర్ణయించిన రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభను ఎంపిక చేసుకున్నారు. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీచేయడం ద్వారా రెండు రాష్ట్రాలపై పార్టీ విస్తరణకు బలం చేకూరుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కాగా శబరిమల వివాదం అనంతరం కేరళ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని ఊవిళ్లూరుతున్న బీజేపీ ప్రస్తుతం భారత్ ధర్మజనసేనతో జతకట్టి వీలైనన్ని ఎక్కువ స్థానాలు రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే పొత్తులో భాగంగా వాయనాడ్ సీటును భారత ధర్మ జనసేన పార్టీకి కేటాయించారు. కానీ వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పొత్తులోని సీటును భాగస్వామ్య పార్టీ నుంచి వెనక్కి తీసుకొని బలమైన అభ్యర్థిని బీజేపీ నిలబెడుతుందని అంతా భావించారు. అయితే వాయనాడ్‌ను మిత్రపక్షానికే వదిలేయడం విశేషం. కాగా ప్రస్తుతం పోటీలో నిలిచిన తుషార్ వెల్లప్పల్లి బీజేడీఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే రాహుల్‌పై పోటీ కోసమే ఆయన త్రిసూర్ నుంచి పోటీ విరమించుకొని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయిమరోవైపు రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థానంలో పోటీచేస్తే రాహుల్ ను ఓడిస్తామని ఇప్పటికే ఎల్డీఎఫ్ నేతలు ప్రకటించారు. అంతే కాదు అమేథిలో ఓటమి నుంచి తప్పించుకునేందుకే రాహుల్ వాయనాడ్ పారిపోతున్నారని ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.
Published by: Krishna Adithya
First published: April 1, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading