Home /News /politics /

NCW QUESTIONS BJP MLA SADHANA SINGHS STATEMENT ON MAYAWATI SB

మాయావతి ఆడా? మగా? అన్న బీజేపీ ఎమ్మెల్యే....మహిళా కమిషన్ నోటీసులు

సాధనా సింగ్, మాయావతి (ఫైల్ ఫోటో)

సాధనా సింగ్, మాయావతి (ఫైల్ ఫోటో)

1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి మరీ ఇప్పుడామె వారితో చేతులు కలిపారరన్నారు. సాధానా సింగ్ చేసిన అభ్యంతరక వ్యాఖ్యల్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

    బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మాయావతి ఆడా కాదు, మగా కాదంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తనను ఘోరంగా అవమానించిన పార్టీతోనే ఇప్పుడామె చేతులు కలిపారని విమర్శించారు. 1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి మరీ ఇప్పుడామె వారితో చేతులు కలిపారరన్నారు. సాధానా సింగ్ చేసిన అభ్యంతరక వ్యాఖ్యల్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అంతేకాదు ఎమ్మెల్యేకు నోటీసులు కూడా పంపింది.

    సాధనా సింగ్ వ్యాఖ్యలపై బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా స్పందించారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీ నేతలు మతి స్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారు వెంటనే ఆగ్రా, బరేలీలోని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలన్నారు. మరోవైపుు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. మాయావతిపై చేసిన వ్యాఖ్యలు భారతీయ మహిళలందర్నీ విమర్శించినట్లే అన్నారు.

    మరోవైపు కేంద్రమంత్రి రామ్‌దాస్ అథావాలె కూడా స్పందించారు. మాయావతి డేరింగ్ డాషింగ్ లేడీ అంటూ కొనియాడారు. దళిత నాయకురాలిగా ఆమె పాలన గొప్పదన్నారు. అలాంటి మాయావతిపై బీజేపీ మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.



    First published:

    Tags: Bjp, Mayawati, National News, Sp-bsp, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు