HOME »NEWS »POLITICS »ncp sacks ajit pawar as legislative party leader for siding with bjp ms

శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్‌ను తొలగించిన ఎన్సీపీ

శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్‌ను తొలగించిన ఎన్సీపీ
అజిత్ పవార్ (File Photo)

శనివారం సాయంత్రం ముంబైలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అజిత్‌ను శాసనసభాపక్ష నేతగా తప్పిస్తున్నట్టు శరద్ పవార్ అధికారికంగా ప్రకటించారు.

  • Share this:
    పార్టీని చీల్చి బీజేపీకి మద్దతునిచ్చి డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన అజిత్ పవార్‌పై ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆయన స్థానంలో జయంతి పాటిల్‌కు బాధ్యతలు అప్పగించింది. ఎన్సీపీలో అజిత్ పవార్ భవితవ్యంపై జయంతి పాటిల్,శరద్ పవార్ తుది నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం ముంబైలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అజిత్‌ను శాసనసభాపక్ష నేతగా తప్పిస్తున్నట్టు శరద్ పవార్ అధికారికంగా ప్రకటించారు.

    కాగా,ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఎన్సీపీ,కాంగ్రెస్ జాగ్రత్తపడుతున్నాయి. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించే ప్రయత్నంలో ఉన్నాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ భేటీ ముగిశాక.. బస్సులు నేరుగా అక్కడికే చేరుకున్నట్టు సమాచారం. ముంబై నుంచి ఎమ్మెల్యేలందరినీ బెంగళూరులోని రిసార్టులకు తరలించనున్నట్టు సమాచారం. ఏదేమైనా మహారాష్ట్ర రాజకీయం ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

    Published by:Srinivas Mittapalli
    First published:November 23, 2019, 21:06 IST

    टॉप स्टोरीज