సమస్య ఈవీఎంలలో లేదు...రిటర్నింగ్ అధికారి మిషన్‌లోనే...

సమస్య ఏవీఎంలు, వీవీప్యాట్ మిషన్లతో కాదని...ఎలక్ట్రోరల్ ఆఫీసర్ చేతిలోని మిషన్‌లో ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అనుమానం వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: June 10, 2019, 4:26 PM IST
సమస్య ఈవీఎంలలో లేదు...రిటర్నింగ్ అధికారి మిషన్‌లోనే...
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Photo: ANI)
  • Share this:
ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఓటింగ్‌ సరళిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏ అభ్యర్థికి ఓటు వేసామో అది వారికి పడలేదని ఓటర్లు గుర్తిస్తే ప్రస్తుతానికి మౌనంగా ఉంటారని, భవిష్యత్తులో మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశముందన్నారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు రావద్దని వ్యాఖ్యానించారు. సమస్య ఏవీఎంలు, వీవీప్యాట్ మిషన్లతో కాదని...ఎలక్ట్రోరల్ ఆఫీసర్ చేతిలోని మిషన్‌లో ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయంలో లోతైన పరిశీలన జరపనున్నట్లు చెప్పారు. సాంకేతిక నిపుణులు, విపక్ష సభ్యులతో ఢిల్లీలో దీనిపై చర్చించనున్నట్లు తెలిపారు.

కాగా బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన సాథ్వి ప్రజ్ఞా సింగ్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా శరద్ పవార్ అభివర్ణించారు.
Published by: Janardhan V
First published: June 10, 2019, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading