‘మహా’ ట్విస్ట్... మరికాసేపట్లో ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

యూపీఏలో భాగమైన ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్... మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో... మోదీతో పవార్ భేటీకి అత్యంత ప్రాధాన్యత నెలకొంది.

news18-telugu
Updated: November 20, 2019, 12:19 PM IST
‘మహా’ ట్విస్ట్... మరికాసేపట్లో ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
శరద్ పవార్, నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
రోజుకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. యూపీఏలో భాగమైన ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్... మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో... మోదీతో పవార్ భేటీకి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. ఈ భేటీ తరువాత పరిణామాలు మారి బీజేపీ, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ? అనే ఊహాగానాలు కూడా రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. తమ షరతులకు అంగీకరించకపోతే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వరకు తీసుకొచ్చిన శివసేన... మోదీ, పవార్ భేటీ తరువాత ఏం జరుగుతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.




First published: November 20, 2019, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading