• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NCP CHIEF SHARAD PAWAR MEETS SONIA GANDHI GIVES NO CLARITY AK

మహారాష్ట్ర అనిశ్చితి... క్లారిటీ ఇవ్వని శరద్ పవార్

మహారాష్ట్ర అనిశ్చితి... క్లారిటీ ఇవ్వని శరద్ పవార్

శరద్ పవార్ (File)

సోనియాగాంధీతో సమావేశమైన శరద్ పవార్... మహారాష్ట్ర రాజకీయ అనిశ్చితిపై స్పష్టత ఇవ్వలేకపోయారు.

  • Share this:
    మహారాష్ట్ర రాజకీయాలపై అనిశ్చితి కొనసాగుతోంది. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయిన శరద్ పవార్... ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సాయంత్రం సోనియాతో భేటీ అయిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ భేటీలో ఏకే ఆంటోనీ కూడా పాల్గొనట్టు పవార్ తెలిపారు. రెండు పార్టీల‌కు చెందిన మ‌రికొంత మంది నేత‌ల‌తో మాట్లాడిన త‌ర్వాత తుది నిర్ణయం ఉంటుందని ఆయన వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం త‌మ కూట‌మిలో శివ‌సేన ఉండాలా లేదా అన్న అంశంపై ఇంకా డైలమా కొనసాగుతోందని ఆయన అన్నారు.

    తమ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం చర్చకు రాలేదని శరద్ పవార్ తెలిపారు. కేవ‌లం కాంగ్రెస్‌, ఎన్సీపీ మ‌ధ్యే ఈ మీటింగ్ జ‌రిగింద‌న్నారు. త‌మకు 170 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్ ఉంద‌ని శివ‌సేన‌ చేసిన కామెంట్‌పై స్పందించేందుకు శ‌ర‌ద్ ప‌వార్ నిరాక‌రించారు.




    First published:

    అగ్ర కథనాలు