• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • NAYINI NARASIMHA REDDY SENSATIONAL COMMENTS ON CM KCR AK

కేసీఆర్ మాట తప్పారు... నాయిని సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ మాట తప్పారు... నాయిని సంచలన వ్యాఖ్యలు

నాయిని నర్సింహరెడ్డి (ఫైల్ ఫోటో)

తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్‌లో అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేసిన నాయిని... తనను కౌన్సిల్‌లోనే కొనసాగాలని కోరారని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో కేసీఆర్ మాట ఇచ్చారని వివరించారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ అన్నారని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. తనకు ఆర్టీసీ చైర్మన్ సహా ఎలాంటి కార్పొరేషన్ పదవి వద్దని నాయిని స్పష్టం చేశారు.

  రాష్ట్ర హోంమంత్రిగా పని చేసిన తాను మళ్లీ అలాంటి పదవులు ఎలా తీసుకుంటానని అన్నారు. పార్టీలోకి ఉన్న కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయిని వ్యాఖ్యానించారు. గులాబీ జెండాకు తామంతా ఓనర్లమే అని నాయిని అన్నారు. సీఎం కేసీఆర్ మా ఇంటికి పెద్ద అని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించిన నాయిని నర్సింహారెడ్డి... మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు