పార్లమెంటులో ‘జై శ్రీరాం’ నినాదాలు...సరికాదన్న నవనీత్ కౌర్

లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార సమయంలో కొందరు బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. లోక్‌సభలో కొందరు సభ్యులు ఇలా ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయడంపై సినీ నటి, ఎంపీ నవీనీత్ కౌర్ స్పందించారు.

news18-telugu
Updated: June 17, 2019, 4:32 PM IST
పార్లమెంటులో ‘జై శ్రీరాం’ నినాదాలు...సరికాదన్న నవనీత్ కౌర్
నవనీత్ కౌర్(Photo: ANI)
  • Share this:
లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార సమయంలో కొందరు బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. లోక్‌సభలో కొందరు సభ్యులు ఇలా ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయడంపై సినీ నటి, ఎంపీ నవీనీత్ కౌర్ స్పందించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడానికి ఆలయాలు ఉన్నాయని... పార్లమెంటులో ఇలా నినాదాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. దేవుళ్లందరూ సమానమన్న ఆమె...జైశ్రీరామ్ నినాదాలతో  ఒకరిని టార్గెట్ చేయడం సరికాదన్నారు.

Pics: సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ గ్యాలరీFirst published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు