Home /News /politics /

NAVJOT SINGH SIDHU ROLLS OUT PUNJAB MODEL SAYS NO HIGH COMMAND CM CHANNI PHOTO MISSING MKS

punjab : సిద్దూ వన్ మ్యాన్ ఇన్నింగ్స్: హైకమాండ్‌పై ధిక్కారం, సీఎం చన్నీ ఫొటో ఫసక్! టార్గెట్ అదేనా?

సొంతగా పంజాబ్ మోడల్ ఆవిష్కరించిన సిద్దూ

సొంతగా పంజాబ్ మోడల్ ఆవిష్కరించిన సిద్దూ

పార్టీ అనే గ్రౌండ్ లో ఫీల్డర్, బౌలర్, బ్యాట్సమ్‌మన్, ఆఖరికి అపైర్ కూడా ఆయనే. సిద్దూ వన్ మ్యాన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కు తంటాలు. ఏకంగా హైకమాండ్ నే ధిక్కరించేలా, ప్రస్తుతం సీఎం చన్నీని దారుణంగా అవమానించేలా సిద్దూ వ్యవహార శైలి. సీఎం సీటు కోసమే ఇదంతా అంటూ..

ఇంకా చదవండి ...
జట్టుకు 11 మంది ఆటగాళ్లు.. బ్యాటింగ్ చేయాలంటే క్రీజ్‌లో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మన్ ఉండటం క్రికెట్‌లో అతి ప్రాథమిక సూత్రం. కానీ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆడుతోన్న ఆట మాత్రం క్రికెట్ కు పూర్తి విరుద్ధం. పార్టీ అనే గ్రౌండ్ లో ఫీల్డర్, బౌలర్, బ్యాట్సమ్‌మన్, ఆఖరికి అపైర్ కూడా ఆయనే. సిద్దూ వన్ మ్యాన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పడుతోన్న తంటాలు అన్నీ ఇన్నీ కావనే కామెంట్లు వస్తున్నాయి. ఏకంగా హైకమాండ్ నే ధిక్కరించేలా, ప్రస్తుతం సీఎం చన్నీని దారుణంగా అవమానించేలా సిద్దూ కనబరుస్తోన్న వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సీటు కోసం ఎప్పటి నుంచో కాచుకొని ఉన్న సిద్దూ.. తన పేరును అధిష్టానం నోటితోనే చెప్పించేలా, ప్రస్తుత ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థిననే బిల్డప్ వచ్చేలా అనూహ్య ఎత్తుడలు అమలు చేస్తున్నారు..

ఇప్పటికే షెడ్యూల్ విడుదలై, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో మిగతా నాలుగు చోట్లా బీజేపీదే అధికారం కాగా, కాంగ్రెస్ పాలిత ఏకైక రాష్ట్రం పంజాబ్ ఒక్కటే. రైతల ఉద్యమం పుణ్యమాని బీజేపీ పెద్దగా ప్రభావం చూపని పంజాబ్ లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలున్నాయి. అయితే, సిద్దూ సింగిల్ మ్యాన్ ఇన్నింగ్స్ కారణంగా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోనుందనే వాదన వినిపిస్తోంది. కెప్టెన్ అమరీందర్ తో వివాదంలో కాంగ్రెస్ హైకమాండ్ సిద్దూ పక్షాన నిలవడం, కెప్టెన్ కాంగ్రెస్ ను వీడినా, సిద్దుకు పీసీసీ పగ్గాలు అప్పగించడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలోనూ సిద్ధూ ఫ్రీహ్యాండ్ తీసుకుంటుండటం కాంగేయులకే మిగుడు పడటం లేదు.

cm kcr : లక్షల నాగళ్లతో modiపై తిరుగుబాటు.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిద్దామంటూ..పంజాబ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించకముందే.. సిద్దూ సొంతగా ‘పంజాబ్ మోడల్’పేరుతో భారీ హామీలు ప్రకటించేశారు. మంగళవారం ఛండీగఢ్ లో జరిగిన సమావేశంలో సిద్దూ తన పంజాబ్ మోడల్ ను విడుదల చేయగా, ఆ ప్రకటన మొత్తంలో ఎక్కడా సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ ఫొటో కానరాలేదు. సిట్టింగ్ సీఎం ఫొటో లేకుండా కాంగ్రెస్ మోడల్ అంటూ సిద్దూ విడుదల చేసిన పత్రాలపై వివాదం రాజుకుంది. అంతటితో అయిపోలేదు..

Covid విలయం: చేతులెత్తేసిన అమెరికా? : కరోనాతో కలిసి బతికే దశకు చేరామన్న Anthony Fauciసీఎం ఫొటో లేకుండా, పార్టీ మేనిఫెస్టో రాకముందే సిద్ధూ సొంతగా హామీలు ప్రకటిండం అటుంచితే, కాంగ్రెస్ హైకమాండ్ పైనా దాదాపు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రిగా ఎవరుండాలో డిసైడ్ చేసేది కాంగ్రెస్ హైకమాండ్ కానేకాదు.. పంజాబ్ ప్రజలే తమ సీఎంను నిర్ణయించుకుంటారు’అని సిద్దూ చేసిన కామెంట్లపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.

PM Modi : తన రికార్డు తానే బద్దలుకొట్టిన మోదీ -ప్రాంతీయ అసమానతలపైనా కీలక వ్యాఖ్యలు

సీఎం అభ్యర్థిని తానే అని చెప్పుకోడానికే సిద్ధూ తహతహలాడుతున్నారని, తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని హైకమాండ్‌పై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారని, అదే సమయంలో చన్నీ మరోసారి సీఎంగా ఉండబోరనే సంకేతాలూ ఇస్తున్నారని కాంగ్రెస్ లోనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి సిద్దూ వన్ మ్యాన్ ఇన్నింగ్స్ పంజాబ్ లో కాంగ్రెస్ ను ముంచుతుందో, తేల్చుతుందో మార్చి 10న తేలనుంది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Congress, Navjot Singh Sidhu, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు