హోమ్ /వార్తలు /politics /

కేబినెట్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా

కేబినెట్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి... తన రాజీనామాల లేఖను కూడా సమర్పించినట్లు తెలిపారు.

    పంజాబ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. తన కేబినెట్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తాను మంత్రివర్గ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని కూడా ట్వీట్ చేశారు సిద్ధు. ఈనెల 10వ తేదీనే ఆయన పదవకి రాజీనమా చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి... తన రాజీనామాల లేఖను కూడా సమర్పించినట్లు తెలిపారు. అయితే సిద్ధు రాజీనామాకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు.

    గతకొన్ని రోజులుగా సిద్ధుకు... పంజాబ సీఎం అమరీందర్ సింగ్ మధ్య సఖ్యత లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధు మంత్రిపదవికి రాజీనామా చేశాడని కొందరు చర్చించకుంటున్నారు.

    First published:

    ఉత్తమ కథలు