Punjab: మలుపులు తిరుగుతున్న పంజాబ్ రాజకీయం.. కీలక పదవికి సిద్ధూ రాజీనామా

నవజ్యోత్ సింగ్ సిద్ధూ (ఫైల్ ఫోటో)

Navjot Singh Sidhu: పంజాబ్ భవిష్యత్తు, రాష్ట్ర సంక్షేమం విషయంలో తాను కాంప్రమైజ్ కాబోనని సిద్ధూ స్పష్టం చేశారు.

  • Share this:
    పంజాబ్ రాజకీయాలు అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ ముఖ్యనేత అమిత్ షాను కలవబోతున్నారనే వార్తలు కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌కు ఇది ఇబ్బందికలిగించే పరిణామం అనే చర్చ జరుగుతున్న సమయంలోనే... పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఓ వ్యక్తి వ్యక్తిత్వం దిగజారిపోయిందని అందులో పేర్కొన్నారు. పంజాబ్ భవిష్యత్తు, రాష్ట్ర సంక్షేమం విషయంలో తాను రాజీపడబోనని స్పష్టం చేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తానని సిద్ధూ లేఖలో పేర్కొన్నారు.

    పంజాబ్ రాజకీయాల్లో కొద్దివారాల క్రితం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా దళిత ఎమ్మెల్యే చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. చన్నీతోపాటు కాంగ్రెస్ నేతలు సుఖ్​జీం​దర్ ఎస్ రాంధవా, ఓపీ సోని డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.



    అయితే తాను ముఖ్యమంత్రి పదవి కీలక పాత్ర పోషించిన సిద్ధూపై అమరీందర్ సింగ్ రగిలిపోతున్నారు. ఆయనను పంజాబ్ సీఎం కానివ్వబోనని శపథం చేశారు. మరోవైపు అమరీందర్ సింగ్ ఢిల్లీలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారని.. బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక‌వేళ ఆయన బీజేపీలో చేరితే.. ఆయనకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనే అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. అమ‌రీంద‌ర్ ఒక్క‌రే కాదు, కాంగ్రెస్ గేమ్‌ప్లాన్‌ను ఓడించాలంటే, పంజాబ్‌లోని జాతీయ‌వాదులంద‌రూ చేతులు క‌ల‌పాల‌ని హ‌ర్యానా మంత్రి విజ్ ఇటీవ‌ల తెలిపారు.

    IT Return: ఆఖరి నిమిషం వరకు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేదా?.. ఫైన్ కట్టాల్సిందే.. ఎంతంటే..

    LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా ? ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..

    ఓ వైపు అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతున్నారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. సిద్ధూ పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అసలు పంజాబ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమరీందర్ సింగ్ తీసుకోబోయే కీలక నిర్ణయం తరువాత పంజాబ్ రాజకీయాలు ఎటువైపు వెళతాయనే అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    మరోవైపు పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడంపై అమరీందర్ సింగ్ స్పందించారు. అతడు నిలకడ లేని వ్యక్తి అని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. అతడు సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు నాయకత్వం వహించేందుకు సరైన వ్యక్తి కాదని ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: