ముంచుకొస్తున్న ఎన్నికలు...బీజూ జనతాదళ్‌కు నిధుల కొరత

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు నిధుల సమీకరణపై దృష్టిసారించాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఒక నెల జీతాన్ని పార్టీ నిధికి విరాళంగా అందజేయాలని బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: December 25, 2018, 12:27 PM IST
ముంచుకొస్తున్న ఎన్నికలు...బీజూ జనతాదళ్‌కు నిధుల కొరత
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: December 25, 2018, 12:27 PM IST
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో దేశ వ్యాప్తంగానూ రాజకీయ పార్టీలు నిధుల సమీకరణపై దృష్టిసారించాయి. ఒడిశాలో వచ్చే ఏడాది ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనుండగా అధికార బీజూ జనతాదళ్(బీజేడీ)ని నిధుల కొరత వెన్నాడుతోంది. దీంతో పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడంపై బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక దృష్టిసారించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తమ నెల రోజుల జీతాన్ని పార్టీ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. డిసెంబరు 26న పార్టీ 21వ వ్యవస్థాపక దినం సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ శ్రేణులకు రాసిన లేఖలో ఈ మేరకు ఆయన కోరారు.

పార్టీకి ఇచ్చే విరాళాలను చెక్‌ల రూపంలో లేదా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా అందజేయాలని సూచించారు. తమ పార్టీకి విరాళాలు అందజేయాలనుకునే పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు కూడా చెక్ లేదా ఆన్‌లైన్ ద్వారా విరాళాలు చెల్లించాలని సూచించారు. ఇప్పటి వరకు పార్టీకి విరాళాలు అందించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే ధివంగత బీజూ పట్నాయక్ జయంతి సందర్భంగా 2015 మార్చి 5న ప్రారంభించిన రక్తదాన కార్యక్రమం(జీవన్ బిందు) ఓ ఉద్యమంలా కొనసాగుతోందని నవీన్ పట్నాయక్ చెప్పారు. ప్రతియేటా 3 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నామని, దేశంలో ఇంత మొత్తంలో రక్తాన్ని సేకరిస్తున్న పార్టీ బీజేడీ ఒకటేనని చెప్పారు.

First published: December 25, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...