news18-telugu
Updated: January 12, 2020, 11:57 AM IST
గల్లా జయదేవ్ ఇంటికి జాతీయ మహిళ కమిషన్
గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తుంది. రాత్రి ఐబికి చేరుకున్నారు జాతీయ మహిళా కమీషన్ కోఆర్డినేటర్ కాంచన్ కత్తర్, కౌన్సిలర్ ప్రవీణ్ సింగ్. కమిటీ సభ్యులను కలిసి అమరావతి రాజధానిలో మహిళలపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును వివరించనున్నారు టిడిపి నేతలు. అనంతరం అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. మహిళలతో కలిసి మహిళ కమీషన్ నిజనిర్దారణ కమిటీ సభ్యులను ఎంపి గల్లా జయదేవ్, టిడిపి మహిళా నేతలు పంచుమర్తి అనూరాద,దివ్యవాణి కలిశారు. అమరావతి రాజధాని గరించి, మహిళల పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై,రైతుల పోరాటం పై కమిటీ సభ్యులకు ఎంపి గల్లా...వివరించారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావాల్సి ఉంది. ఆదివారానికి ఈ పర్యటన కాస్త వాయిదా పడింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
January 12, 2020, 10:39 AM IST