జగన్ నిర్ణయంపై.. జాతీయ స్థాయిలో దుమారం

సీఎం జగన్

జగన్ నిర్ణయాన్ని స్థానిక పార్టీలు రాజకీయాల నేతల దగ్గర్నుంచి... జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తలు, పాత్రికేయులు, మేథావులు సైతం మండిపడుతున్నారు.

 • Share this:
  ఏపీ సీఎంగా జగన్ అధికారం చేపట్టి దాదాపుగా ఐదునెలలు పూర్తయ్యాయి.ఈ కొద్దికాలంలోనే జగన్ అనేక విషయాలకు సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలను అమలు చేశారు. ప్రజల మనసును చొరగొన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలంటూ... ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఆదా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం మాత్రం జాతీయ స్థాయిలో దుమారం రేకెత్తిస్తోంది. అదే అమరావతిలో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  అయితే జగన్ నిర్ణయాన్ని స్థానిక పార్టీలు రాజకీయాల నేతల దగ్గర్నుంచి... జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తలు, పాత్రికేయులు, మేథావులు సైతం మండిపడుతున్నారు. సింగపూర్‌ కంపెనీలు అమరావతి నుంచి వెళ్ళిపోవడం ఏపీకి చెడు వార్తని కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏపీలో ఏం జరుగుతోందని జాతీయ మీడియం సైతం దీనిపై తీవ్రంగా చర్చిస్తుంది.
  మరోవూపు ప్రముఖ జర్నలిస్టు సైతం దీనిపై స్పందించారు. సింగపూర్‌కు చెందిన జేమ్స్ క్రాబ్ట్‌జీ సైతం.. ఏపీ తీసుకున్న నిర్ణయం హస్యాస్పదం అంటూ.. దీనికి భారీ ముల్యం తప్పదంటూ ట్వీట్ చేశారు.

  మరోవైపు అమరావతిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ రద్దుచేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో 6.84 చ.కిమీ ల అభివృద్ధి కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీల మధ్య అప్పటి ప్రభుత్వ హయాంలో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీలు పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్మెంట్ ప్రొజెక్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్ట్ అప్ ఏరియాను అభివృద్ధి చేసేలా చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.  First published: