జాతీయ పార్టీల చూపు జగన్‌ వైపు.. సోనియా, ప్రణబ్ రంగంలోకి?

ఏపీ నుంచి జగన్‌ను కలుపుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దానికోసం కీలక నేతలు జగన్‌తో దోస్తీకి చేతులు కలుపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: May 16, 2019, 1:29 PM IST
జాతీయ పార్టీల చూపు జగన్‌ వైపు.. సోనియా, ప్రణబ్ రంగంలోకి?
వైఎస్ జగన్ (File)
news18-telugu
Updated: May 16, 2019, 1:29 PM IST
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత. ఇప్పుడు ఈయన దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టబోయేది ఆయన పార్టీయేనని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. అదీకాక, ఎంపీ సీట్లు కూడా వైసీపీ‌కే వస్తాయని ఘంటాపథంగా చెబుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాదని కొన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీలు ముందస్తు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి జగన్‌ను కలుపుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దానికోసం కీలక నేతలు జగన్‌తో దోస్తీకి చేతులు కలుపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల వైసీపీ నేతలతో కేరళ కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సోనియానే స్వయంగా జగన్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతలు జగన్‌తో టచ్‌లో ఉన్నారు. వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి పలు సార్లు వారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, జగన్ మాత్రం ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని యోచిస్తున్నారు.

మరోవైపు, జాతీయ పార్టీలకు మెజారిటీ రాకపోతే ప్రాంతీయ పార్టీలే దిక్కు అని, జాతీయ పార్టీలకు అవకాశం ఇచ్చే కంటే ఫెడరల్ ఫ్రంట్‌‌గా ముందుకు వెళదామని కేసీఆర పలు ప్రాంతీయ పార్టీలు,కమ్యూనిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మధ్యే కేరళ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ను కూడా కలిశారు. అయితే, అన్నింటికీ ఈ నెల 23న విడుదలయ్యే ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం చెబుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...