హోమ్ /వార్తలు /National రాజకీయం /

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైఫ్ లో ట్విస్ట్ లు.. మిస్ ఇండియా కాలేక పోయారు కానీ..

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైఫ్ లో ట్విస్ట్ లు.. మిస్ ఇండియా కాలేక పోయారు కానీ..

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ జీవితంలో ఎన్నో ట్విస్ట్ లు

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ జీవితంలో ఎన్నో ట్విస్ట్ లు

Smriti Irani: కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా తరువాత.. అన్ని రాష్ట్రాల ప్రజలకు ఎక్కువగా తెలిసిన కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే.. స్మృతి ఇరానీ అని టక్కున చెప్పొచ్చు.. అమె తన తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థి పార్టీలను గుక్క తిప్పుకోనియకుండా చేస్తారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమస్య అని ఎవరైనా పోస్ట్ చేస్తే.. వెంటనే స్పందిస్తూ ఉంటారు. అయితే ఆమె జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు ఉన్నాయని మీకు తెలుసా..?

ఇంకా చదవండి ...

Big twists in Central Minster Smriti Irani Life Story:  కేంద్ర ప్రభుత్వం (Central Government)లో పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. ఎన్నే ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవారు ఉన్నారు. అయితే అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే..  ప్రధాని మోదీ (Prime minster modi),  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  (Home Minster amit shah) తరువాత.. అంతంగా తెలిసిన మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) అనడం అతిశయోక్తి కాదు. కేంద్ర మంత్రిగా ఆమె ఏం చేశారు.. ఏం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే.. విమర్శలు చేయడంతో ఆమెకు ఆమె సాటి.. ప్రత్యర్థి నేత ఎవరైనా.. తన పదునైన తూటాలాంటి మాటలతో ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆమె నెంబర్ వన్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కేవలం విమర్శలు చేయడమనే కాదు.. నిత్యం ప్రజల మధ్యలోనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే ఆమెకు సంబంధించిన వార్తలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ తరచూ కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న స్మృతి.. ఈ స్థాయికి చేరుకోడానికి ఎన్నో కష్టాలను దాటారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన స్మృతి జీవితం అంతా సాఫీగా సాగలేదు. ఆమె కెరీర్ లో హోటల్‌లో కూడా పని చేశారు అంటే ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఊహించవచ్చు. జీరో నుంచి క్షేత్ర స్థాయికి చేరుకోవడం అంటే మాటలు కాదు. అయితే ఆమె జీవితం కొన్ని సంఘటనలు చూస్తే.. ఇన్ని మలుపులు ఉంటాయా అనిపించక మానదు..

తండ్రికి సహాయం చేయడానికి..

స్మృతి ఢిల్లీలోని మల్హోత్రా కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పంజాబీ–తల్లి అస్సామీ. అయితే స్మృతి ఇంటి ఆర్థిక పరిస్థితి మొదటిలో ఏ మాత్రం బాగా ఉండేది కాదు. తన తండ్రి కొరియర్ కంపెనీ నడిపేవారు. ఇక ఆమె పాఠశాల విద్య తర్వాత కరస్పాండెన్స్‌తో తన బి.కామ్ చదువును ప్రారంభించారు. కానీ అప్పటి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పూర్తి చేయలేకపోయారు. ఆ సమయంలో ఆమె ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా కూడా పనిచేయాల్సి వచ్చింది. తన తండ్రి సంపాదన సరిపోకపోవడంతో.. సాయం పడ్డారు.

ఇదీ చదవండి : ఏ బ్రాండ్ కావాలో తేల్చుకోలేకపోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. పెగ్ వేయడంలోనూ స్టైల్

తన తండ్రికి ఆర్ధికంగా సహాయం చేయడానికి, హోటల్ ఉద్యోగం వదిలి ఢిల్లీలో బ్యూటీ ప్రొడెక్ట్స్ మార్కెటింగ్ చేసేవారు. అమె అప్పటికే చాలా అందంగా.. అందర్నీ ఆకట్టుకునే రూపం ఉండడంతో.. అదే సమయంలో, ముంబైలో తన అదృష్టాన్ని పరీక్షించుకోమని ఒకరు ఆమెకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ముంబైకి చేరుకున్నారు. అక్కడికి వెళ్లాక మోడలింగ్ లో చాలా కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూ 1998లో, ఆమె మిస్ ఇండియా కోసం ఆడిషన్ చేసి ఎంపికయ్యారు. 

ఇక తన జీవితం టర్న్ అవుతుంది అనుకున్న సమయంలో.. ఆమె పోటీలో పాల్గొనడానికి నిరాకరించారు. చివరికి ఆమె తల్లి ఆదుకుంది. అమ్మ ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసి స్మృతికి ఇచ్చింది. పోటీలో స్మృతి ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, గెలవలేకపోయారు. ఆ డబ్బును తన తల్లికి తిరిగి ఇచ్చేయడానికి, స్మృతి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. కోసం వెతకడం ప్రారంభించారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఫ్లైట్ అటెండెంట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఎంపిక కాలేదు. చాలా మోడలింగ్ ఆడిషన్స్‌లో కూడా ఆమె తిరస్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె కొన్ని రోజులు ప్రైవేట్ ఉద్యోగం చేశారు. 

నటిగా గుర్తింపు

‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ (2000-08)లో తులసి విరానీగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ, తాను ఎప్పుడూ ఫిట్‌గా లేనందున ఏక్తా కపూర్ బృందం తనను తిరస్కరించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు ఏక్తా కపూర్ ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆ సీరియల్ లో ప్రధాన పాత్రను ఇచ్చారు. ఆ పాత్రతో స్మృతి రాత మారింది. ఇక 2001లో పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకోవడంతో ఆమె స్మృతి ఇరానీగా ప్రసిద్ధి గుర్తింపు పొందారు. అక్టోబర్ 2001లో, ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి జోహార్ అని పేరు పెట్టారు. రెండు సంవత్సరాల తరువాత, అంటే సెప్టెంబర్ 2003లో, ఆమె కుమార్తె జోయిష్‌ పుట్టింది. వారికి షానెల్ అనే సవతి కూతురు కూడా ఉంది. ఆమె ఇరానీ మొదటి భార్య మోనా కుమార్తె.


రాజకీయ ప్రయాణం ఎలా అయ్యింది అంటే..?

స్మృతి ఇరానీ చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ తో అనుబంధం కొనసాగించారు. ఆమె తాత ఆర్ఎస్ఎస్(RSS) వాలంటీర్. తల్లి జన్ సంఘీ. దీంతో 2003లో బీజేపీలో స్మృతి ఇరానీ చేరారు. మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ 2004లో ఎంపిక అయ్యారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కపిల్‌ సిబల్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

2010లో స్మృతి బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో యూపీలోని అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై లోక్‌సభకు పోటీ చేసి ఇక్కడ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి అమేథీ పార్లమెంట్ నుంచి ఆమె గెలిచారు. స్మృతి ఇరానీ ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

First published:

Tags: AP Politics, India news, National News, Smriti Irani

ఉత్తమ కథలు