హోమ్ /వార్తలు /రాజకీయం /

గాడ్సే చంపింది ఒక్కడినే.. రాజీవ్ గాంధీ 17వేల మందిని చంపాడు : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

గాడ్సే చంపింది ఒక్కడినే.. రాజీవ్ గాంధీ 17వేల మందిని చంపాడు : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

నలిన్ కుమార్ కటీల్ (File)

నలిన్ కుమార్ కటీల్ (File)

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోతను ఉద్దేశిస్తూ రాజీవ్ గాంధీపై పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రా

    సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నవేళ బీజేపీ-కాంగ్రెస్ రాజకీయం 'గాంధీ-గాడ్సే'ల చుట్టూ తిరుగుతోంది. గాడ్సే చరిత్రలో ఓ దేశభక్తుడిగా మిగిలిపోతాడంటూ బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి ప్రగ్యా సాధ్వి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. గాడ్సే దేశభక్తుడైతే.. గాంధీ దేశద్రోహా..? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రగ్యా సాధ్వి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వారు ఖండించినప్పటికీ.. కొంతమంది ఆ పార్టీ నేతలు మాత్రం అవే వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటక బీజేపీ ఎంపీ నలిన్ కుమార్ మాట్లాడుతూ.. 'గాడ్సే ఒక్కడిని చంపితే.. కసబ్ 72మందిని చంపితే.. రాజీవ్ గాంధీ 17000మందిని హత్య చేశాడు. దీన్ని బట్టి ఎవరు అత్యంత క్రూరులో మీరే ఆలోచించుకోండి.' అని వ్యాఖ్యానించారు.


    1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోతను ఉద్దేశిస్తూ రాజీవ్ గాంధీపై నలిన్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీని అవినీతిపరుడు అని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఘాటుగా స్పందిస్తూ వచ్చిన కాంగ్రెస్.. బీజేపీ నేత చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇంకెంత ఘాటుగా స్పందిస్తుందోనన్న చర్చ జరుగుతోంది.

    First published:

    Tags: Bjp, Congress, Lok Sabha Elections 2019, Rahul Gandhi, Rajiv Gandhi

    ఉత్తమ కథలు