అయోధ్య రామ మందిరంపై సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

ఆగస్టు 5న జరిగే రామ మందిరం భూమిపూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: July 31, 2020, 12:25 PM IST
అయోధ్య రామ మందిరంపై సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ
అయోధ్య రామ మందిరంపై సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ
  • Share this:
వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోట్లాది ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న రామమందిరం భూమి పూజ చరిత్రలో నిలిచిపోతుందని.. ఆ రోజు ఏపీ దేవాదాయ శాఖ పరిధిల్లో ఉన్న 24వేల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలని ఆయన కోరారు. అంతేకాదు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖను ఆదేశించాల్సిందిగా లేఖలో కోరారు రఘురామ కృష్ణంరాజు.

ఆగస్టు 5న జరిగే రామ మందిరం భూమిపూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 50 మంది వీఐపీలు హాజరువుతారని సమాచారం. వీఐపీలు, ఆలయ పూజారులు, సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు కలిపి మొత్తం 200 మంది మాత్రమే పాల్గొంటారు. భూమిపూజకు ముందు మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజ చేస్తారు. హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకుంటారు. మొత్తం రూ.326 కోట్ల ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading