చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ మామ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ మామ సంచలన వ్యాఖ్యలు

నార్నె శ్రీనివాసరావు(File)

భువనేశ్వరి, బాలకృష్ణే.. చంద్రబాబు తన కుటుంబమనుకుంటున్నారన్నారు. తన తోబుట్టువులు ఎక్కడ ఉన్నారో కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు నార్నె.

  • Share this:
    ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎంతగానో నమ్మిన చంద్రబాబు తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు సొంత సోదరి కూతురికి ఇచ్చి చంద్రబాబే దగ్గరుండి మరి తన వివాహం జరిపించారని గుర్తుచేసుకున్నారు. ఇక అప్పట్నుంచి చంద్రబాబును దగ్గరుండి చూశానన్నారు. తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు నార్నె. కష్టాలు కూడా పెట్టారన్నారు. తనను ఆర్థికంగా కుంగదీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు కుటుంబంలో తనతో పాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరన్నారు. సొంత చెల్లెళ్ల ఇంట్లోనే దీపం పెట్టలేని ఆయన.. ఆంధ్రరాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల ఇళ్లలో దీపాలేం పెడతారని తీవ్ర విమర్శలు చేశారు. భువనేశ్వరి, బాలకృష్ణే.. చంద్రబాబు తన కుటుంబమనుకుంటున్నారన్నారు. తన తోబుట్టువులు ఎక్కడ ఉన్నారో కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు నార్నె.

    ఎన్నికల సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ సంచలన ఆరోపణలు చేశారు నార్నె శ్రీనివాసరావు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మామ అయిన నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడంపై టీడీపీలోనూ చర్చ సాగుతోంది. నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ మద్దతు వైసీపీకే ఉండొచ్చనే ప్రచారం కూడా మొదలైంది. అంతకుముందు జగన్‌తో సమావేశమైన నార్నె శ్రీనివాసరావు... గత నెల 28న వైసీపీలో చేరారు. ఆయన గుంటూరు ఎంపీ స్థానం లేదా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
    First published: