రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి ఎవరంటే..?

పార్లమెంట్ పెద్దల సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. దీంతో మిత్రపక్షాలకు చెందిన నేతనే రంగంలోకి దింపే అవకాశం ఉంది.

news18-telugu
Updated: July 17, 2018, 10:47 PM IST
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి ఎవరంటే..?
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మోదీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఇదే ఆఖరి బడ్జెట్. ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం రైతులకు, మధ్య తరగతి ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వస్తువుల ధరలు తగ్గించే చాన్స్ ఉంది.
  • Share this:
ఈ నెల 1న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీకాలం ముగిసిపోవడంతో కొత్తగా ఆ పదవిని దక్కించుకునేది ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎలాగైనా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని విపక్షాలు ఉమ్మడిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఓ అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తున్నాయి. దీనికి సంబంధించి గత సోమవారం రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తో ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరిపాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పేరు పరిశీలనలో ఉంది. ఇంకా ఖరారుకాలేదు. పదవికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేరును ప్రకటించాలని భావిస్తున్నారు.

ఎన్డీయే కూడా అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. బీజేపీకి కూడా పూర్తిగా సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీయే తరఫున ఓ అభ్యర్థిని బరిలోకి దింపితే.. రాబోయే ఎన్నికల్లో పొత్తుల పరంగా కూడా పనికొస్తుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్‌ నేత నరేష్ గుజ్రాల్‌ను రంగంలోకి దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మిత్రపక్షానికి చెందిన నేతకు మద్దతివ్వడం ద్వారా సపోర్టిచ్చే పార్టీలకు కూడా పాజిటివ్ సందేశం పంపినట్టుగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది.


రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉంటారు. అభ్యర్థి గెలవాలంటే 122 ఓట్లు అవసరం (అందరూ ఓటేస్తే). బీజేపీకి 69 మంది బలం ఉంది. గత వారమే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరో నలుగురిని నామినేట్ చేశారు. ఇతర మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయేకి 115 సీట్లు రావొచ్చని లెక్కలు వేస్తున్నారు. 13 మంది సభ్యులున్న అన్నా డీఎంకే, ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఎటువైపు నిలుస్తాయని ఆసక్తికరంగా మారింది. వైసీపీ మాత్రం బీజేపీ అభ్యర్థికి ఓటు వేయబోమని స్పష్టం చేసింది. బిజూ జనతాదళ్ (9 మంది), టీఆర్ఎస్ (6గురు) ఎవరికి ఓటేయాలని ఇంకా నిర్ణయించుకోలేదు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చూద్దాంలే అన్న ధోరణితో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కీలకంగా మారే అవకాశం ఉంది.

నరేష్ గుజ్రాల్ (File Image:ANI)
నరేష్ గుజ్రాల్ (File Image:ANI)
Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2018, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading