హోమ్ /వార్తలు /National రాజకీయం /

BIGGEST EXCLUSIVE INTERVIEW : ఎన్నికల వేళ మోదీ అంతరంగ ఆవిష్కరణ

BIGGEST EXCLUSIVE INTERVIEW : ఎన్నికల వేళ మోదీ అంతరంగ ఆవిష్కరణ

Modi Exclusive Interview : భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు.

Modi Exclusive Interview : భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు.

Modi Exclusive Interview : భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు.

ఇంకా చదవండి ...

  బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా.. అందులో ముఖ్యమైన అంశాలేంటో చెప్పగలరా?

  మోదీ : ఒక బాధ్యాతయుతమైన రాజకీయ పార్టీగా రూపొందించిన సమగ్ర మేనిఫెస్టో ఇది. 2022, 2024కి ఇందులో రోడ్ మ్యాప్ ఇచ్చాం. దీని అర్థం ఐదేళ్ల పాలన ముగింపుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉండటం కాదు.. నిరంతరం వారికి జవాబుదారీగా ఉండటం. 2022 నాటికి మేము సాధించాలనుకుంటున్న 75 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచాం. 2022లో భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకునే నాటికి మేము ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి చేస్తాం.

  అలాగే 2024 చివరి నాటికి వందేళ్ల స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకునే 2047 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని భారత పునాదులను నిర్మించబోతున్నాం. నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించడం, జాతీయ భద్రత వంటి అంశాలు అందులో ఉంటాయి. ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ.. తమ మేనిఫెస్టోల ద్వారా ఎవరికి న్యాయం చేసినట్టు? దళితులు, మహిళలు, యువత, సీనియర్ సిటిజెన్, ఆదివాసీలు ఎవరికి చేసిందేమి లేదు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక నైరాశ్యంలో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు.. వాళ్లలో నమ్మకం కలిగించేందుకు పనిచేశాం. సామాన్యుడి కనీస అవసరాలైన ఇల్లు, విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేశాం. గడిచిన ఐదేళ్లలో కనీస మౌలిక సదుపాయాలను అందించడంలో విజయం సాధించాం. వచ్చే ఐదేళ్లలో కామన్ సిటిజెన్స్‌ను సాధికారత వైపు నడిపించేందుకు కృషి చేస్తాం.

  మిగతా పార్టీలతో పోలిస్తే మీ మేనిఫెస్టో భిన్నమని ఎలా చెప్పగలరు..? ప్రత్యేకించి కాంగ్రెస్ మేనిఫెస్టోకి బీజేపీ మేనిఫెస్టో ఎలా భిన్నంగా ఉండబోతుంది?

  మోదీ : పేరులోనే చాలా తేడా ఉంది. వాళ్ల మేనిఫెస్టో ఘోష్న పాత్ర, మా మేనిఫెస్టో సంకల్ప్ పాత్ర. రెండు మేనిఫెస్టోలను పోల్చి చూసుకోవాల్సిందిగా మేధావి వర్గాన్ని కోరుతున్నాను. బీజేపీ పాలనను దృష్టిలో పెట్టుకుని తాజా మేనిఫెస్టోను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. చాలా విషయాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోకి, మా మేనిఫెస్టోకి తేడా ఉంది. ప్రస్తుతం మనం ఉగ్రవాదాన్ని ఏరివేసే ప్రయత్నంలో ఉన్నాం. నైతికంగా ఇప్పటికే మనం వారిపై పైచేయి సాధించాం. ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా సాఫ్ట్‌గా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ వైఖరికి కాంగ్రెస్ మేనిఫెస్టోకి తేడా లేదు. సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. అంటే, భద్రతా బలగాల నుంచి ఆయుధాలు తొలగించాలన్నమాట. అలా చేయడం సరైందేనా? 60ఏళ్లు దేశాన్ని పాలించిన ఓ పార్టీ ఇలా మాట్లాడటం సబబేనా?

  ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత RISING INDIA SUMMITలో నేను మిమ్మల్ని కలిశాను. అంతకు కొద్ది గంటల ముందే బాలాకోట్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అసలు పాక్‌పై ప్రతిదాడులు జరపాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు..? ఆపరేషన్ సక్సెస్ అయిందని మీకెప్పుడు తెలిసింది..? ఆ సమయంలో మీతో ఎవరెవరు ఉన్నారు.. మీరెలా ఫీల్ అయ్యారు..?

  మోదీ : పుల్వామా దాడి జరిగిన రోజే చెప్పాను.. పాకిస్తాన్, ఉగ్రవాదులు చాలా దారుణమైన తప్పిదం చేశారని. అప్పటి నా బాడీ లాంగ్వేజ్‌, స్పీచ్‌ను బట్టి ఆ సమయంలో నా భావోద్వేగాలు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజానికి పుల్వామా దాడికి ఆ క్షణమే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం. కానీ తొందరపడి, క్షణికావేశంలో షార్ట్ కట్ నిర్ణయాలు తీసుకోలేదు. సాయుధ బలగాలతో సహా ప్రతీ ఒక్కరిని సంప్రదించి ఎలా ముందుకెళ్లాలని చర్చలు జరిపాను. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులను మన భద్రతా బలగాలు అప్పటికే మట్టుబెట్టాయి. కానీ దాంతో నేను సంతృప్తి చెందలేదు. 26/11 దాడులు జరిగినప్పుడు మనం ప్రతిదాడులు చేయకపోవడం పాకిస్తాన్‌కు మరింత ధైర్యాన్ని ఇచ్చినట్టయింది. ఈసారి అలాంటి తప్పిదం చేయవద్దనుకున్నాం. అందుకే సర్జికల్ స్ట్రైక్స్‌తో విజయవంతంగా బదులిచ్చాం.

  బాలాకోట్ దాడులకు సంబంధించి ఎవరూ కొట్టిపారేయడానికి వీల్లేని ఆధారాలేమైనా మీ వద్ద ఉన్నాయా? సందర్భం వస్తే వాటిని ప్రజల ముందు పెడుతారా?.. బాలాకోట్‌పై దాడుల్లో అమిత్ షా 250మంది ఉగ్రవాదులు చనిపోయారని చెబుతున్నారు..?

  మోదీ : శత్రువుతో మనం పోరాడుతున్నప్పుడు మనవాళ్లే ఆధారాలున్నాయా? అని మాట్లాడటం శత్రువుకు మరింత ధైర్యాన్నిస్తుంది. అదే సమయంలో దేశాన్ని గందరగోళంలోకి నెడుతుంది.. సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి తరుణంలో మన సైనికుల ఆత్మగౌరవాన్ని చాటడానికి దేశమంతా ఒకే గొంతుక వినిపించాలి. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి.. అప్పుడెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా?.. లేదు. అధికారాన్ని కోల్పోయి తిరిగి అధికారంలోకి రావాలన్న ఆత్రుతలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది. ఆధారాలే కావాలంటే.. పాకిస్తానే ఒక పెద్ద ఆధారం. ఏ దాడి జరగకపోతే.. తెల్లవారుజామున 5గంటలకే పాకిస్తాన్ ఎందుకని ట్వీట్ చేస్తుంది.

  బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు స్వేచ్చగా తిరుగుతున్నారు. కశ్మీర్‌పై మళ్లీ ఎప్పుడైనా దాడికి పాల్పడే స్థితిలో వారు ఉన్నారు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మనవైపు నుంచి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా?

  మోదీ : మనమంతా ఒక విషయాన్ని గుర్తించాలి. ఉగ్రదాడులు చాలావరకు తగ్గిపోయాయి. అయితే పుల్వామా మాత్రం అందుకు మినహాయింపు. సాధారణంగా భద్రతా బలగాలే ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి.. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అదే జరిగింది. పుల్వామా విషయంలో టెర్రరిస్టులు వచ్చి దాడి చేసి పారిపోలేదు.

  గత ఏడాది వరకు దేశంలో రామ మందిర్‌పై వాడి వేడి చర్చ జరిగింది. మీ మేనిఫెస్టోలోనూ రామ మందిర్ అంశాన్ని పెట్టారు. కానీ గత ఆర్నెళ్లుగా మీ నేతలంతా రామ మందిర్‌పై సైలెంట్ అయిపోయారు. ఎందుకని రామ మందిర్ టాపిక్ మీ నుంచి ఇప్పుడంతగా ప్రతిధన్వించడం లేదు.

  ఈ విషయంలో సమస్యంతా మీడియాతోనే..

  రామ మందిర్ నిర్మాణం గురించి మాట్లాడితే.. మాట్లాడటానికి ఏ ఇష్యూ లేకనే బీజేపీ హిందుత్వను ఇష్యూ చేస్తోందంటారు..

  ఒకవేళ రామ మందిర్‌పై సైలెంట్ అయిపోతే.. ఎందుకు మాట్లాడట్లదేదని మళ్లీ మీరే అడుగుతారు..

  రామ మందిర్‌పై బీజేపీది చాలా స్థిరమైన వైఖరి. ఆ విషయంపై మా భావజాలంలో ఎప్పటికీ మార్పు ఉండదు.

  మసూద్ అజర్‌ను పాకిస్తాన్ భారత్‌కి అప్పగిస్తుందా? పాకిస్తాన్ ఆర్మీ చెప్పు చేతల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నుంచి ఇలాంటి నిర్ణయం ఆశించవచ్చా? ఆయన ఇప్పటికీ యుద్దం గురించి మాట్లాడుతున్నారు.. భారత్ పాక్పై దాడులకు ప్లాన్ చేస్తుందంటున్నారు..?

  మోదీ : పాకిస్తాన్ చేసే ఏ ఒక్క వాదనను భారత్ నమ్మడానికి సిద్దంగా లేదు. పాకిస్తాన్‌కు అసలు విశ్వసనీయత లేదు. కాబట్టి భారతీయులెవరూ పాకిస్తాన్‌ చెప్పినదాన్ని నమ్మడం లేదు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు మాత్రం పాకిస్తాన్ వాదననే వినిపిస్తున్నాయి. ఇండియాలో ప్రతీ ఆర్నెళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి.. ఎన్నికల కోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. బాలాకోట్ దాడులను ఎన్నికల రాజకీయానికి వాడుకోవడం తగదు.

  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీరొక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గమంటున్నారు. మరోవైపు చైనా మాత్రం ఇప్పటికీ పాకిస్తాన్‌ను వెనకేసుకొస్తూనే ఉంది. తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడకుండా నాలుగోసారి అడ్డుకుంది. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేయబోతున్నారు?

  మోదీ : ఓవైపు చైనాతో మనకు ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. చైనా మన దేశంలో పెట్టుబడులు పెడుతోంది, మనం చైనాలో పెట్టుబడులు పెడుతున్నాం. మన నాయకులు అక్కడికి వెళ్తున్నారు.. చైనా నాయకులు ఇక్కడికి వస్తున్నారు. మరోవైపు చైనాతో ఇప్పటికీ సరిహద్దు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. భారత్‌కు ఒక స్పష్టమైన వైఖరి ఉంది.. చైనా దృక్పథం మరోలా ఉంది. కాబట్టి ఇరువర్గాలు భిన్నత్వాన్ని ఆమోదించాలి.. విభేదించడాన్ని వివాదంగా మలచాలని భావించకూడదు.

  కొన్ని సందర్భాల్లో మనం పాలస్తీనా వైపు నిలబడ్డాం. మరికొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ వైపు నిలబడ్డాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరాన్ వైపు నిలబడితే.. మరికొన్ని సందర్భాల్లో అరబ్ దేశాల వైపు నిలబడ్డాం. వారి వారి జాతీయ ప్రయోజనాల కోసం ప్రతీ దేశానికి కొన్ని సొంత ప్రణాళికలు, వ్యూహాలు ఉంటాయి. ఒకప్పుడు అంతర్జాతీయంగా భారత్‌కు రష్యా మద్దతు మాత్రమే ఉండేది.. మిగతా ప్రపంచ దేశాలన్ని పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేవలం చైనా మాత్రమే పాకిస్తాన్‌తో ఉంది. మిగతా ప్రపంచ దేశాలన్ని భారత్ వెంట ఉన్నాయి. మార్పును మనం అర్థం చేసుకోవాలి.. మా విజయానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

  ఇండియాలో చైనాకు పెద్ద మార్కెట్ ఉంది. చైనా వస్తువులను బహిష్కరిస్తామని భారతీయులు చెప్పడం సరైనా చర్యగానే పరిగణించాలా..? భారత్‌లో చైనా పెట్టుబడులు అవసరం లేదని కొంతమంది వాదిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయమేంటి?

  మోదీ : గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రతీ దేశం మరో దేశంపై ఆధారపడటం, వారితో సంబంధాలు కలిగి ఉండటం అనివార్యంగా మారింది. ఒక ప్రభుత్వంగా ప్రపంచ ట్రేడ్ ఆర్గనైజేషన్ చట్టాలను భారత్ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇక చైనా వస్తువులను కొనాలా వద్దా.. అన్నది ప్రజల వ్యక్తిగత నిర్ణయం.

  మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా అడ్డుపడింది. ఈ విషయంపై చైనాతో ఏమైనా మాట్లాడారా?

  మోదీ : అన్ని సమావేశాల్లో అన్ని సమస్యల గురించి చర్చిస్తూ వస్తున్నాం. అందులో ఇదొకటి. ఈ సమస్య కూడా ఇంతకుముందు నుంచే ఉంది..

  మన జాతీయ భద్రత ప్రత్యక్షంగా కశ్మీర్ సమస్యతో ముడిపడి ఉంది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి జమ్మూ హురియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్(కశ్మీర్ ప్రజల విలువలు) ఇన్సానియత్(మానవత్వం) గురించి మాట్లాడారు. 2017లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నాతో చెప్పారు.. కశ్మీర్‌కు కావాల్సింది కేవలం అభివృద్ది మాత్రమే కాదని, వాళ్లకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని. కానీ పరిస్థితులు రోజురోజకు దిగజారుతున్నట్టే కనిపిస్తోంది. కశ్మీరీ యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతూ జిహాదీ గ్రూపులతో జతకడుతున్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుంది?

  మోదీ : కశ్మీర్ సమస్య చాలా పాతది. ఒకవేళ కశ్మీర్ సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ డీల్ చేసి ఉంటే.. ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. జునాగఢ్, నిజాం సంస్థానాలతో పటేల్ ఎలా వ్యవహరించాడో అందరికీ తెలిసిందే. కానీ కశ్మీర్ విషయాన్ని నెహ్రూ సరిగా డీల్ చేయలేదు. కాబట్టే ఇప్పటికీ అదో వివాదంగానే మిగిలిపోయింది. ఏళ్లుగా వేలమంది సైనికులు చనిపోతూనే ఉన్నారు. కశ్మీర్‌ను భారత్ విస్మరించట్లేదన్న నమ్మకం కలిగించడానికి గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. కానీ మేము సమస్యను చాలా సున్నితంగా అర్థం చేసుకున్నాం.. సున్నితంగానే పరిష్కరించాలని భావిస్తున్నాం.

  కేవలం రెండున్నర జిల్లాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని మొత్తం కశ్మీర్ అలాగే ఉందని భావిస్తున్నాం. ఆ పరిస్థితిలో మార్పు రావాలి. దీనికి మీడియా కూడా తోడ్పాటును అందించాలి. అక్కడి పురోగతిని మనం కచ్చితంగా గుర్తించాలి.. ఉదాహరణకు పోటీ పరీక్షల్లో, స్పోర్ట్స్‌లో కశ్మీరీలు రాణిస్తున్నారు. దేశంలోని ప్రతీ టాప్ యూనివర్సిటీలో ఇవాళ కశ్మీరీ విద్యార్థులు ఉన్నారు. దీన్ని మనం ప్రోత్సహించాలి. ఇటీవలే అక్కడ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. దాదాపు 70-75శాతం పోలింగ్ నమోదైంది. వందలమంది సర్పంచ్‌లు ఎన్నికై పనిచేయడం మొదలుపెట్టారు.

  అలాగే కశ్మీర్‌లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్టికల్ 35A, 370 కశ్మీర్‌లో పెట్టుబడులకు అడ్డంకిగా ఉంది. అక్కడ మనం IIMS నిర్మించవచ్చు.. కానీ ప్రొఫెసర్స్ ఎవరూ అక్కడికి వెళ్లడానికి సిద్దంగా లేరు. వారి పిల్లలకు అక్కడి స్కూళ్లలో అడ్మిషన్ లభించదు. వారు ఉండేందుకు ఇళ్లు దొరకవు. నెహ్రూ తీసుకొచ్చిన పాలసీల కారణంగా ఇవన్నీ జమ్మూకశ్మీర్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా తయారయ్యాయి. కాబట్టి వీటన్నింటిని కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే చట్టాలను పున:పరిశీలించాల్సిన అవసరం ఉంది.

  కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని భావిస్తున్నారు? మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకోవడం తప్పిదంగా మీరు భావిస్తున్నారా?

  మోదీ : పీడీపీతో పొత్తు అనేది ఒక ప్రయోగం. కశ్మీర్ ప్రజలు ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. నిజానికి పీడీపీ, ఎన్‌సీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చాలారోజులు ఎదురుచూశాం. కానీ వాళ్లు కనీసం ఒకరి వైపు మరొకరు కన్నెత్తి కూడా చూసుకోలేదు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సీనియర్ అయిన మెహబూబా ముఫ్తీతో 2,3నెలలు చర్చలు జరిపాం. మా భావజాలాలు పరస్పర వ్యతిరేకమైనా.. ఒక బాధ్యతను నిర్వర్తించడానికి ఇద్దరం కలిసి ముందడుగు వేశాం. ఇదో ప్రయోగమని భావించాం.. ముఫ్తీ నేత్రుత్వంలో అంతా సజావుగానే సాగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అక్కడ గవర్నర్ పాలన విధించబడింది. పంచాయితీ ఎన్నికలు జరిగితే హింస చెలరేగుతుందని ముఫ్తీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎక్కడా హింస చోటు చేసుకోలేదు. మీడియా కూడా కశ్మీర్‌ను ఒకవైపు మాత్రమే చూపించకుండా.. అక్కడ జరుగుతున్న మంచిని, పురోగతిని కూడా చూపించాలి.

  కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 &ఆర్టికల్ 35A రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. భవిష్యత్తులో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు రద్దు చేస్తే భారత్ నుంచి విడిపోతామని మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా హెచ్చరిస్తున్నారు. దీనిపై మీ స్పందనేంటి?

  మోదీ : సమస్యంతా కశ్మీర్‌లోని 50 రాజకీయ కుటుంబాలతోనే. సమస్యను వారు మరింత పెద్దది చేస్తూనే ఉన్నారు. సాధారణ కశ్మీరీ ప్రజలకు ఏ చిన్న ప్రయోజనం జరగడం వీరికి ఇష్టం లేదు. ప్రజల సెంటిమెంటును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. ఇటీవల ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆ కుటుంబాలపై దాడులు చేశారు. వేర్పాటు వాదులకు నిధులు సమకూర్చి పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడుతోంది. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతలో ఎన్ఐఏ నిమగ్నమైతే.. కశ్మీరీ ప్రజలు ఇళ్ల ముందు నిలబడి చప్పట్లు కొట్టారు. తమ భావోద్వేగాలతో 50 ఏళ్లుగా ఆటలాడుతున్న ఆ రాజకీయ కుటుంబాల నుంచి విముక్తి కావాలని కశ్మీరీలు కోరుకుంటున్నారు. ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370 విషయం కాదు.. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

  సాయుధ బలగాలకు ప్రత్యేక అధికార (AFSPA)చట్టాన్ని తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసలా చట్టంపై మీరేమంటారు?

  మోదీ :  సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని తొలగించడమంటే... సైనికులను నిరాయుధులను చేయడమే. ఉగ్రవాదులతో పోరాడుతున్న సమయంలో.. AFPSA చట్టాన్ని తొలగిస్తామని హామీ ఇవ్వడం వారికి ప్రోద్బలాన్ని ఇవ్వడమే. సైన్యంపై కాంగ్రెస్ ఆలోచనలు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. దేశభక్తి ఉన్నవారెవరూ కాంగ్రెస్ మేనిఫెస్టోను సమర్థించరు.

  అలాంటి చట్టాన్ని సవరించాలన్నా, తొలగించాలన్నా ముందుగా... దానితో అవసరం లేని వాతావరణాన్ని ఏర్పరచాల్సి ఉంటుంది. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్‌లో ఈనెల మొదట్లో అక్కడి ప్రభుత్వం చట్టాన్ని కొంతవరకూ ఎత్తివేసింది. కొన్ని జిల్లాల నుంచి దాన్ని తొలగించాం. 1980 నుంచీ ఇప్పటివరకూ ఈ చర్య చేపట్టింది మా ప్రభుత్వమే.

  బీజేపీ మేనిఫెస్టోలో జాతీయవాదమే అతిపెద్ద ఎజెండా. కానీ నిరుద్యోగం, రైతాంగ సమస్యల నుంచి దేశం దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి ఎజెండాతో ముందుకొచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనికేమంటారు?

  మోదీ :  జాతీయవాదం అంటే 'భారత్ మాతా కీ జై'. స్వచ్చ్ భారత్ చేయడానికి ప్రయత్నించడం జాతీయవాదం కాదా? పేద ప్రజలకు అండగా నిలబడటం జాతీయవాదం కాదా?, పేద ప్రజలకు వైద్యం చేయించుకునే స్తోమత లేక అనారోగ్యంతో మరణిస్తే.. అది జాతీయవాదమా?.. అసలు జాతీయవాదం అంటే ఏమిటి?. పేదలు మరణిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా.. లేక ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ద్వారా వారికి రూ.5లక్షల భీమా సౌకర్యం కల్పించాలా?, రైతులు అధిక దిగుబడి పొందడానికి అధునాతన సాంకేతికపై అవగాహన కల్పించి... ఒకటిన్నర రెట్లు గిట్టుబాటు ధర కల్పించడం జాతీయవాదం కాదా?. జాతీయవాదం అంటే తన దృష్టిలో డైనమిక్‌గా వ్యవహరించడం.'భారత్ మాతా కీ జై' అనడం అంటే.. దేశంలోని 1.3బిలియన్ ప్రజలకు జై కొట్టడం.. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరుచడం జాతీయవాదం. ఇవన్నీ జాతీయవాదం అనుకుంటే.. తాము నిజమైన జాతీయవాదులం.

  'మై భీ చౌకీదార్' క్యాంపెయిన్ ఆలోచన అసలు ఎవరికి వచ్చింది? 'చౌకీదార్ చోర్ హై' అన్న కాంగ్రెస్ నినాదాన్ని కౌంటర్ చేయడానికే ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారా?

  మోదీ :  2013-2014లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నన్ను కాపలాదారుగా భావించాలని ప్రజలను కోరాను. దేశ సంపద తరలిపోకుండా చూస్తానని మాట ఇచ్చాను. ఈ రోజుకూ నేను చౌకీదార్ గానే ఉన్నాను. ఎవరూ సంపద దోచుకోకుండా చేస్తున్నాను. ఎవరైనా సంపదను దోచుకుంటే... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాను. ఆ విషయంలో ప్రభుత్వం విజయం సాధించింది.

  దేశంలోని పేద ప్రజల కోసం కాంగ్రెస్ న్యాయ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తోనూ కాంగ్రెస్ సంప్రదించింది. నిజంగా న్యాయ్ పథకం ద్వారా మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా?

  మోదీ :  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదం 'అబ్ న్యాయ్ హోగా(ఇప్పుడు న్యాయం జరుగుతుంది). అంటే, తెలిసో.. తెలియకనో.. మొత్తానికి 60 ఏళ్ల తమ పాలనలో కాంగ్రెస్ దేశానికి అన్యాయం చేసింది. అందుకే దశాబ్దాల కాంగ్రెస్ అన్యాయానికి బలైన భారతీయులు ఇప్పుడు సరైన న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. న్యాయ్ పథకం గురించి ప్రస్తావిస్తున్న కాంగ్రెస్.. మరి 1984లో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు ఏం న్యాయం చేస్తుంది? ఛత్తీస్‌గఢ్,రాజస్తాన్, మధ్యప్రదేశ్ రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైంది? అధికారంలోకి వచ్చిన 10 రోజులకే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. 100 రోజులైనా అమలుచేయలేదు.వాళ్లకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది?. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల తర్వాత కాంగ్రెస్ 'హిందు టెర్రర్' పదాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది.సంఝౌతా పేలుళ్లతో సంబంధం ఉందని ఎంతోమంది అమాయకులను కాంగ్రెస్ జైలు పాలు చేసింది. దీనిపై తమకు న్యాయం జరగాల్సిందేనని హిందువులు అడుగుతున్నారు.చేయని తప్పుకు ఏళ్లుగా శిక్ష అనుభవించినవారు తమకు న్యాయం కావాలంటున్నారు. హిందువులైన తమకు టెర్రరిస్టులుగా ఎందుకు ముద్రవేశారో తెలుసుకోవాలనుకుంటున్నారు.

  2014లో బీజేపీకి చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించబోతున్నారు?

  మోదీ :  మాకెన్ని సీట్లు వస్తాయో నేను నిర్ణయించలేను. అది ఓటర్లు నిర్ణయిస్తారు. బీజేపీని గెలిపించాలని 125కోట్ల మంది భారతీయులు నిర్ణయించుకున్నారు. 2014 కంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎన్డీయే మిత్రపక్షాలు మాకు అదనపు బలం. ఈ ఎన్నికల్లో ఎన్డీయే బలం మరింత పెరుగుతుంది. ఈ ఐదేళ్లలో నిస్వార్థకంగా, నమ్మకంగా ఎలా పనిచేశామో భవిష్యత్తులోనూ అదే పాలనా అందిస్తాం.

   ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు మహాకూటమికే ఓటేయాలని మాయావతి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికలను ఇది ప్రభావితం చేస్తుందని మీరు భావిస్తున్నారా?

  మోదీ :  ఓటమిని ఎదుర్కోవడానికి సిద్దమైన మాయావతి ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సహజం. తమకే ఓటు వేయాలని ఆమె ముస్లింలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యాఖ్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. నేను మాయావతి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు.. ఎందుకంటే ఆమె మునిగిపోతున్న నావలో ఉన్నారు. నేను సెక్యులర్ బ్రిగేడ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా.మాయావతి చేసిన ఈ వ్యాఖ్యలపై 'అవార్డ్ వాపసీ' గ్రూప్ ఎందుకు మౌనంగా ఉంది.మాయావతి లాంటి అప్పీల్ హిందువులకు ఎవరైనా చేసి ఉంటే.. ఆ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసేది.ఎందుకని వారు సెలక్టివ్‌గా మాత్రమే స్పందిస్తున్నారు?.. వాళ్ల సెక్యులరిజంకు ఇది రిమార్క్ కాదా.. సెక్యులరిజం ముసుగులో దాక్కునే ఇలాంటి వారే దేశానికి అత్యంత ప్రమాదం.

  మీ విమర్శకుల్లో, అందులోనూ పెద్ద సంఖ్యలో ఆర్థిక వేత్తలు చెబుతున్న దాని ప్రకారం, పెద్ద నోట్ల రద్దు అంతగా విజయం సాధించలేదు అంటారు. 99.9 శాతం రద్దయిన నోట్లు మళ్లీ వ్యవస్థలోకి వచ్చేశాయి. అలాగే ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం చూసినట్లయితే, నగదు చలామణి సైతం 19 శాతం పెరిగింది. అది ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద కుదుపుగా భావిస్తుంటారు. డీమానిటైజేషన్ అనేది మీరు అనుకున్న రీతిలో అమలు చేయలేకపోయారని భావిస్తున్నారా..? అది కూడా అంతటి క్లిష్టమైన ప్రక్రియను మన బ్యాంకింగ్ వ్యవస్థ భరించలేని స్థితిలో ఉన్న సమయంలో చేపట్టారు కదా..

  మోదీ :  గతంతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ కరెన్సీ చెలామణి ఉంది. నోట్ల రద్దుతో దెబ్బతిన్న బడా పారిశ్రామికవేత్తలు రికవర్ కావడానికి ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. కానీ సాధారణ పౌరులు మాత్రం మొదట ఇబ్బందిపడ్డా.. ఆ తర్వాత కుదురుకున్నారు. నోట్ల రద్దు వల్ల బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారంటే.. పేదల ఓటు బ్యాంకు కోల్పోయామని బాధపడుతున్నవారు, నల్లధనం లావాదేవీలకు అడ్డుకట్ట పడిందని బాధపడుతున్నవారు.. వాళ్లు మాత్రమే ఇప్పటికీ బాధపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం బాగానే ఉన్నారు. మన ఆర్థిక వృద్దిరేటు పెరగడానికి నోట్ల రద్దు కూడా ఒక కారణం. గత ఐదేళ్లలోనే ట్యాక్స్ పేయర్స్ సంఖ్య రెట్టింపు అయింది. హవాలా లావాదేవీలకు, నకిలీ కంపెనీల నిర్వహణకు నోట్ల రద్దు ద్వారా అడ్డుకట్ట పడింది.

  రాఫెల్ ‌యుద్ధ విమానాలకు సంబంధించి అటు భారత, ఫ్రెంచ్ ప్రభుత్వాల నుంచి చాలా వివరణలు  వచ్చాయి. కానీ అది ఇప్పటికీ వివాదాస్పద అంశమే కదా. సుప్రీ కోర్టు జడ్జిమెంట్ అనంతరం కూడా ఆ అంశం ఇంకా వివాదంగానే ఉంది? అయితే ప్రభుత్వం వేరే పద్ధతుల్లో ఏమైనా ఈ వివాదాన్ని పరిష్కరించనుందా ?

  మోదీ :  రాఫెల్ విషయంలో.. నిజానికి ప్రతిపక్షాలు పెద్దగా స్పందించలేదు. ఒక్కరు మాత్రం అదే అబద్ధాన్ని పదేపదే చెబుతూ వస్తున్నారు. ప్రతి చోటా ఈ అబద్ధాల్ని ప్రజలు తిప్పికొడుతూనే ఉన్నారు. చివరకు సుప్రీంకోర్టు, కాగ్ కూడా ఈ ఆరోపణలను ఖండించాయి. ఈ ఆరోపణలు ఎన్నాళ్లు నిలుస్తాయి. ఆరోపణలు చేస్తున్న ఆ వ్యక్తి సలహాదారులు కూడా రాఫెల్ అంశం రాజకీయ అంశం కాదని చెప్పారు. తన సొంతవాళ్లే ఇక ఆ విషయాన్ని

  First published:

  Tags: Lok Sabha Election 2019, Narendra modi, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు