లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మోదీ మేనియాతో కమలం పార్టీ చరిత్ర సృష్టించింది. 2014 కంటే ఎక్కువ స్థానాలు సాధించి మరోసారి అధికారం చేపట్టబోతోంది. మొత్తం 542 స్థానాల్లో బీజేపీ సింగిల్‌గా 303 సీట్లు సాధించింది. ఎన్డీయే కూటమికి మొత్తంగా 353 స్థానాలు దక్కాయి. ఇక యూపీఏ 91 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇందులో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లులో విజయం సాధించింది. ఇతరులు 98 సీట్లలో గెలుపొందారు.
తెలంగాణలో 16 సీట్లు సాధించాలనుకున్న కారుకు కాంగ్రెస్, బీజేపీ బ్రేకులు వేశాయి. గత ఎన్నికల్లో 11 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 9 సీట్లకే పరిమితమయింది. బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో గెలిచాయి. నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ కూతురు ఓడిపోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read More