నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిన తర్వాత ఎన్డీయేపక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం అయ్యారు. ఎన్డీయేపక్షాల ఎంపీలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీపక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించగా, ఆ పార్టీ ఎంపీలు అందరూ బల్లలు చరిచి దాన్ని ఆమోదించారు. దీంతో నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టానికి లాంఛనంగా ఆమోదం తెలిపారు. ప్రకాశ్ సింగ్ బాదల్ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ప్రతిపాదించారు. అందుకు సభ్యులు ఆమోదించారు. అనంతరం తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా మద్దతు పలికారు. ఆ తర్వాత వరుసగా ఎన్డీయే భాగస్వామ్యపక్షాల పార్టీల నేతలు మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. నరేంద్ర మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు హాజరయ్యారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.