మోదీ ప్రమాణస్వీకారోత్సవ వేళ బీజేపీకి ఆ పార్టీ మిత్రపక్షం జేడీయూ ఝలకిచ్చింది. కేంద్రమంత్రి వర్గ కూర్పుపై అలకవహించిన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్..మోదీ ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించారు. జేడీయూకు ఒక కేబినెట్, మరో సహాయ మంత్రి పదవి మాత్రమే కేటాయించడంపై ఆయన తీవ్ర అంసతృప్తి వ్యక్తంచేశారు. మోదీ కేబినెట్‌లో దూరంగా ఉంటామని..ఐతే ఎన్డీయేలో మాత్రం కొనసాగుతామని స్పష్టంచేశారు.
బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించిన జేడీయూ నేతలు...ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు ఢిల్లీలో సమావేశమయ్యారు. తమకు ఒకే ఒకే కేబినెట్ పోస్టు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకానొక దశలో మోద ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని భావించారు. ఐతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతోనే నితీష్ కుమార్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.