Modi Swearing-in Ceremony Live: ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీ

Narendra Modi Swearing-In LIVE: నరేంద్ర మోదీ పట్టాభిషేకానికి దేశ విదేశీ అతిరథ మహారథుల రాకతో రాష్ట్రపతి భవన్ వద్ద సందడి నెలకొంది.

news18-telugu
Updated: May 30, 2019, 7:46 PM IST
Modi Swearing-in Ceremony Live: ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీ
నరేంద్ర మోదీ (రూ.2కోట్లు, ర్యాంక్ 46)
  • Share this:
''మై నరేందర దామోదర్‌దాస్ మోదీ..'' అంటూ దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు మోదీ. ఆయన చేత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. మోదీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా,నితిన్ గడ్కరీ, సదానందగౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్, థావర్ చంద్ గెహ్లాట్, ఎస్.జయశంకర్, రమేశ్ పొఖ్రియాల్, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, పీయుష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా దేశవిదేశీ అతిథు రాకతో రాష్ట్రపతి భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా దిగ్గజాలతో పాటు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. దాదాపు 8వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద ఇంత పెద్ద సంఖ్యలో కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.


మోదీ ప్రమాణస్వీకారం హైలైట్స్:

ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవాన్ని టీవీలో వీక్షించిన ఆయన తల్లి హీరాబెన్.మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సర్ సోనియా, కాంగ్రెస్ సీనియర నేతలు గులాంనబీ ఆజాద్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్నాటక సీఎం కుమారస్వామి, చత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం ఈ.పళనిస్వామి, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, ప్రముఖు పారిశ్రామిక వేత్తలు ముఖేశ్ అంబానీ, రతన టాటా, సినీ ప్రముఖులు రజినీకాంత్ తదితరులు హాజరయ్యారు.

కేంద్ర కేబినెట్‌లో అమిత్ షాకు తొలిసారి చోటు దక్కింది. ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ అమిత్ షా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.మోదీ మంత్రివర్గంలో మాజీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి చోటు కల్పించలేదు. కేంద్రమంత్రి జేపీ నడ్డాను కేబినెట్‌కు దూరంగా ఉంచారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం అమరీందర్, ఛత్తీస్‌గ్‌ఢ్ సీఎం భూపేశ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మిజోరం సీఎం జోరాం తంగా తదితరులు హాజరుకాలేదు.

మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి మయన్మార్ అధ్యక్షుడు విన్ మియంట్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్,  బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ, మయన్మార్ ప్రత్యేక రాయబారి, కిరిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సూరంబే జీన్బెకోవ్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో పాటు 'బిమ్‌స్టెక్' దేశాధినేతలు హాజరయ్యారు.

జేడీయూకు ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి మాత్రమే ఇవ్వడంపై ఆ పార్టీ అసంతృప్తితో ఉంది. మోదీ కేబినెట్‌లో చేరకూడదని జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నిర్ణయించారు. ఐతే ఎన్డీయేలో మాత్రం కొనసాగుతామని  వెల్లడించారు.

మోదీ ప్రమాణస్వీకారాన్ని లైవ్‌లో చూడండి:
First published: May 30, 2019, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading