PM Modi swearing-in ceremony Live : మోదీ కేబినెట్‌లో అమిత్ షా ప్రమాణస్వీకారం

Modi swearing-in Ceremony | మోదీ, షా ద్వయం సారధ్యంలో బీజేపీ దూసుకుపోతోంది. 2014లో కంటే కూడా భారీ మెజారిటీతో పార్లమెంట్‌లో అడుగుపెట్టింది.

news18-telugu
Updated: May 30, 2019, 7:28 PM IST
PM Modi swearing-in ceremony Live : మోదీ కేబినెట్‌లో అమిత్ షా ప్రమాణస్వీకారం
అమిత్ షా ప్రమాణస్వీకారం
  • Share this:
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మరో మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రమాణస్వీకారం చేశారు. దేవుడిపై ప్రమాణస్వీకారం చేశారు అమిత్ షా. అమిత్ షా మూడోస్థానంలో ప్రమాణస్వీకారం చేయడంతో ఆయనకు చాలా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు స్పష్టం అవుతుంది. మోదీ చేపట్టిన ఎన్నో పథకాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అమిత్ షాను వినియోగించుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. అమిత్ షాకు ఆర్థిక శాఖను అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. లేకపోతే రక్షణ శాఖను కూడా అప్పగించవచ్చని భావిస్తున్నారు. అరుణ్ జైట్లీకి అనారోగ్యం కారణంగా కేబినెట్‌లో చేరలేదు. ఆ స్థానంలో అమిత్ షాకు ఆర్థిక శాఖ అప్పగిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి.

మోదీ, షా ద్వయం సారధ్యంలో బీజేపీ దూసుకుపోతోంది. 2014లో కంటే కూడా భారీ మెజారిటీతో పార్లమెంట్‌లో అడుగుపెట్టింది. అమిత్ షా చాలా కష్టపడతారని, కానీ, ఆయనకు తగిన గుర్తింపు రాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అమిత్ షా కు కూడా మోదీ కేబినెట్‌లో కచ్చితంగా చోటు దక్కుతుందని కమలనాధులు అంచనా వేశారు. అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, 3లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు.



First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు