మోదీ ప్రమాణ స్వీకార అతిథులకు...నోరూరించే వంటకాలు

వేడి వేడి టీతో పాటు సమోసా, శాండ్‌విచ్‌, లెమన్‌ టార్ట్‌ లాంటి స్నాక్స్‌, ప్రముఖ బెంగాలీ స్వీట్‌ రాజ్‌భోగ్‌ (రసగుల్లా లాంటి స్వీట్‌) కూడా పెట్టనున్నారు.

news18-telugu
Updated: May 30, 2019, 8:58 AM IST
మోదీ ప్రమాణ స్వీకార అతిథులకు...నోరూరించే వంటకాలు
నమూనా చిత్రం (ఫేస్ బుక్ ఫోటో)
news18-telugu
Updated: May 30, 2019, 8:58 AM IST
మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.దేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి ఢిల్లీలో ఏడు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. మరికొద్ది గంటల్లో నరేంద్రమోదీ దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన నేతలతో పాటు దాదాపుగా 6వేల మంది అతిథులు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ... ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథుల కోసం ఈ సారి ప్రత్యేక వంటలు వార్చి వండిస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రత్యేకమైన రుచుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అతిథులకు ఇచ్చ ఆతిథ్యం గుర్తుండిపోయేలా... ఘుమఘుమలాడే వంటకాల్ని సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌‌లో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత అతిథులకు టీ సర్వ్‌ చేయనున్నారు. వేడి వేడి టీతో పాటు సమోసా, శాండ్‌విచ్‌, లెమన్‌ టార్ట్‌ లాంటి స్నాక్స్‌, ప్రముఖ బెంగాలీ స్వీట్‌ రాజ్‌భోగ్‌ (రసగుల్లా లాంటి స్వీట్‌) కూడా పెట్టనున్నారు. ఇక రాత్రి డిన్నర్‌లో వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు... రాష్ట్రపతి భవన్‌ పాపులర్‌ వంటకమైన ‘దాల్‌ రైసినా’ను వడ్డించనున్నారు. దాల్‌ రైసినా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకమైన వంటకం. మినపగుళ్లతో చేసే ఈ పదార్థాన్ని సుమారు 48 గంటల పాటు తక్కువ మంటపై నెమ్మదిగా వండుతారట. ఇవాల్టి మెనూలో దాల్‌ రైసినా కూడా ఉండటంతో మంగళవారం రాత్రి నుంచే దీన్ని వండటం మొదలుపెట్టినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మోదీ అతిథులకు గుర్తుండిపోయేలా... విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి దేశవిదేశాల నుంచి వందలాది మంది అతిథులు వస్తుండటంతో, ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలంటే, కనీసం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఢిల్లీలో దిగేలా రావాలని అక్కడి అధికారుల నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...