హోమ్ /వార్తలు /రాజకీయం /

మాయావతి మునిగిపోతున్న నావలో ఉన్నారు.. ఆ అప్పీల్‌పై సెక్యులరిస్టుల స్పందనేది? : మోదీ

మాయావతి మునిగిపోతున్న నావలో ఉన్నారు.. ఆ అప్పీల్‌పై సెక్యులరిస్టుల స్పందనేది? : మోదీ

ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi on Mayawati : మాయావతి చేసిన ఈ వ్యాఖ్యలపై 'అవార్డ్ వాపసీ' గ్రూప్ ఎందుకు మౌనంగా ఉందని మోదీ ప్రశ్నించారు. మాయావతి లాంటి అప్పీల్ హిందువులకు ఎవరైనా చేసి ఉంటే.. ఆ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసేదన్నారు.

  భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవలి స్టేట్‌మెంట్‌పై కూడా మోదీ స్పందించారు. ముస్లింలు మహాకూటమికి మాత్రమే ఓటు వేసి ఓట్ల చీలిక జరగకుండా చూడాలన్న ఆమె కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు.


  ఓటమిని ఎదుర్కోవడానికి సిద్దమైన మాయావతి ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సహజం. తమకే ఓటు వేయాలని ఆమె ముస్లింలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యాఖ్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. నేను మాయావతి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు.. ఎందుకంటే ఆమె మునిగిపోతున్న నావలో ఉన్నారు. నేను సెక్యులర్ బ్రిగేడ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా.
  ప్రధాని నరేంద్ర మోదీ


  మాయావతి చేసిన ఈ వ్యాఖ్యలపై 'అవార్డ్ వాపసీ' గ్రూప్ ఎందుకు మౌనంగా ఉందని మోదీ ప్రశ్నించారు. మాయావతి లాంటి అప్పీల్ హిందువులకు ఎవరైనా చేసి ఉంటే.. ఆ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసేదన్నారు. ఎందుకని వారు సెలక్టివ్‌గా మాత్రమే స్పందిస్తున్నారు? అని ప్రశ్నించారు. వాళ్ల సెక్యులరిజంకు ఇది రిమార్క్ కాదా అని నిలదీశారు. సెక్యులరిజం ముసుగులో దాక్కునే ఇలాంటి వారే దేశానికి అత్యంత ప్రమాదం అని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉనికి కోసం పాకులాడుతున్న మాయావతి.. ఓట్లు పొందడానికి ఏమైనా చేస్తారని విమర్శించారు.

  First published:

  Tags: Bjp, Bsp, Lok Sabha Election 2019, Mayawati, Narendra modi, Uttar Pradesh Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు